180 సీట్లున్న విమానంలో నలుగురే.. రూ.20 లక్షలు ఖర్చు చేసి.. - MicTv.in - Telugu News
mictv telugu

180 సీట్లున్న విమానంలో నలుగురే.. రూ.20 లక్షలు ఖర్చు చేసి..

May 28, 2020

qas

కరోనా సంక్షోభంలోనూ కొందరు బడాబాబులు తమ దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు. ఓవైపు వలస కార్మికులు డబ్బుల్లేక కాలి నడకన తమ ఊళ్లకు నడిచి వెళ్తున్నారు. మరోవైపు ఇలా ధనవంతులు ఇలా కరోనాతో జాగ్రత్త పడుతున్నారు. ఆ మహమ్మారి ఎక్కడ తమకు అంటుకుంటుందనే భయంతో భోపాల్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త 180సీట్లు ఉన్న A320 విమానాన్ని కేవలం నలుగురు కోసం బుక్ చేశాడు. కూతురు, ఇద్దరు పిల్లలు, పని మనిషి మాత్రమే ప్రయాణించేందుకే బక్ చేసుకున్నాడు. ఢిల్లీ వెళ్లాల్సిన తన కుటుంబాన్ని ఎయిర్‌పోర్టు, విమానాల్లో ప్రయాణించే కరోనా నుంచి కాపాడుకోవడానికి ఇలా చేశానని చెప్పాడు. ఎయిర్‌బస్-320 బుక్ చేసుకోవడానికి రూ.20 లక్షలు ఖర్చు అయింది. లిక్కర్ వ్యాపారవేత్త కుటుంబం లాక్‌డౌన్ కారణంగా 2నెలలుగా భోపాల్‌లో చిక్కుకుంది. 

దీంతో ఆయన తన కుటుంబాన్ని తీసుకుని ఢిల్లీ బయలుదేరడానికి సిద్ధమయ్యారు. అయితే దారిన పోయే కరోనా దరిద్రం తమకు ఉత్తి పుణ్యానికి ఎక్కడ అంటుకుంటుందోనని కుటుంబానికి ప్రత్యేకంగా ఓ విమానాన్నే బుక్ చేసుకున్నాడు. తన కుటుంబంతో ఆ విమానంలో బయలుదేరి వెళ్లారు. ‘A320 అనే ఎయిర్ బస్ 180సీట్ సామర్థ్యంతో మే 25న నలుగురు ప్రయాణికులతో ప్రయాణమైంది. ఎటువంటి మెడికల్ ఎమర్జెన్సీ లేకపోయినా దానిని బుక్ చేసుకోవడంతో నడిపాల్సి వచ్చింది’ అని ఎయిర్‌లైన్ ఉద్యోగులు వెల్లడించారు.