ఎంత పనాయెరా...! - MicTv.in - Telugu News
mictv telugu

ఎంత పనాయెరా…!

August 31, 2017

అబ్బా.. గీ సీన్ జూసి మందు బాబులు ఎంత ఫీలైతున్నరో ఏమో.  దినాం పెగ్గెసెటోళ్లకైతె ఇది జూసినంక నిద్రగుడ వట్టది. నల్గొండ జిల్లా  శెట్టి పాలెం దగ్గర స్పీడ్ గ అస్తున్న ఇంకో బండిని తప్పించబోయి..బీర్లు మోస్కపోతున్న లారీ బొక్క బోర్ల వడ్డది. బీర్ల కాటన్లు మొత్తం రోడ్ల మీద వడి చాలా బీరు సీసలు తుక్కు తుక్కు అయినయ్. ఇగ రోడ్డు పాలైన బీరును జూసి తాగుబోతుల పానం కల కలా అయిందట. దొర్కినయ్ దొర్కినట్టు నిండు బీరు సీసలు ఎత్కపోయిన్రట. సమాచారం అందుకున్న పోలీసోళ్లు  వచ్చి పబ్లిక్ నుంచి బీరు సీసాలకు కాపాడిన్రట. మొత్తం పల్గిపోయినయ్, మంది ఎత్కపోయినయ్ అంత లెక్కగడితే 3 లక్షలకు మీదనే నష్టమైందట. పాపం లారీ డ్రైవర్  చిన్న చిన్న దెబ్బలతో బైటవడ్డడు. మొత్తానికైతే దొర్కిన బీరు సీసాలతోని మందుబాబులు పండగ జేస్కుంటున్రు గావచ్చు.ఇంకా నయ్యం పోలీసోళ్లు  జల్ధిన వచ్చిన్రు కాబట్టి అవన్న దక్కినయ్ లేకపొతే  లారీ మొత్తం లూటీ జేసెటోళ్లు గావచ్చు.