మందుబాబులకు షాక్.. దసరాకు ధరలు పెరిగే అవకాశం.. ఎంతంటే - MicTv.in - Telugu News
mictv telugu

మందుబాబులకు షాక్.. దసరాకు ధరలు పెరిగే అవకాశం.. ఎంతంటే

September 30, 2022

తెలంగాణలో మళ్లీ మద్యం ధరలు పెరిగే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. దసరా సందర్భంగా మందు రేట్లు పెంచాలని కంపెనీలు భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. డిమాండుని బట్టి 10 నుంచి 30 శాతం పెరిగే అవకాశముంది. కరోనా లాక్ డౌన్ తర్వాత మద్యం ధరలు మూడు సార్లు పెరిగాయి. అయితే తయారీ సంస్థలకు చెల్లించే ప్రాథమిక ధర మాత్రం పెరగలేదు. పెరిగిన ధరలకనుగుణంగా వచ్చే ఆదాయమంతా ప్రభుత్వానికే వెళ్తుంది. దీంతో బేసిక్ రేట్లు పెంచడం కోసం డిస్టిలరీలు ఒత్తిడి తెస్తున్నాయి.

ప్రభుత్వం రేట్లు పెంచకపోతే దసరాకు కృత్రిమ కొరత సృష్టించేలా కంపెనీలు ప్రణాళిక రూపొందించాయన్న సమాచారంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వారు కోరుతున్న విధంగా రేట్లు పెంచేందుకు శాఖాపరమైన కమిటీని నియమించింది. పెంపుదలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆ నివేదిక ఇవ్వాళో రేపో రానుంది. దాన్ని పరిశీలించాక ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అయితే ధరలు పెంచకపోతే కంపెనీలు కృత్రిమ కొరత సృష్టించే అవకాశాలున్నాయన్న సమాచారంతో ఏకంగా మద్యం దిగుమతులకైనా వెనుకాడమని ఎక్సైజ్ శాఖ తేల్చి చెప్పినట్టు సమాచారం.