మందుబాబులకు తెలంగాణ సర్కారు శుభవార్త - MicTv.in - Telugu News
mictv telugu

మందుబాబులకు తెలంగాణ సర్కారు శుభవార్త

February 10, 2018

షాపుల దోపిడీకి గురవుతూ మత్తుగా చిత్తవుతున్న మందుబాబులకు తెలంగాణ సర్కారు శుభవార్త తెలిపింది. మద్యం దుకాణాల దోపిడీకి అడ్డుకట్ట వేయడానికి మొబైల్ యాప్‌ను సిద్ధం చేసింది. దీన్ని ఎక్సైజ్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేశ్‌కుమార్ ఆవిష్కరించారు.

880 రకాల మద్యాలు, సైజుల వారీగా వాటి ఎమ్మార్పీ ధరలు ఈ యాప్‌లో ఉంటాయి. ఇంగ్లిష్ తోపాటు తెలుగులోనూ సమాచారం ఉంటుంది. వినియోగదారులు వివిధ కేటగిరీల్లోకి వెళ్లి, సైజులు వారీగా ధరలు తెలుసుకోవచ్చు. షాపులు ఈ ధరల కంటే ఎక్కవ రేట్లకు అమ్మితే మందుబాబులు యాప్ ద్వారా అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.

ఎక్సైజ్‌శాఖ ప్రధాన కార్యాలయంలోని కాల్‌సెంటర్‌ ఫిర్యాదు చేరుతుంది. తర్వాత పోలీసులు స్పందిస్తారు. కాగా, అన్ని మద్యం షాపులు మద్యం బ్రాండ్ల ధరలను తమ షాపుల ముందు మూడు అడుగుల పొడవు, రెండు అడుగుల వెడల్పు ఉన్న బోర్డులపై ప్రదర్శించాని ఎక్సైజ్ విభాగం ఆదేశించింది.