దసరా కిక్కు.. ఎంత తాగారంటే !  - MicTv.in - Telugu News
mictv telugu

దసరా కిక్కు.. ఎంత తాగారంటే ! 

October 27, 2020

Telangana

దసరా పండగ సందర్భంగా మద్యం ఏరులై పారింది. తెలంగాణ వ్యాప్తంగా మందుబాబులు బాటిళ్లను ఎత్తిపడేశారు. ఒకే రోజు ఏకంగా రూ. 100 కోట్ల విలువైన లిక్కర్ లాగించేశారు. ఓ వైపు వీకెండ్ కావడంతో మద్యం అమ్మకాలు ఈసారి భారీగా పెరిగాయి. గతేడాదితో పోల్చితే ఈసారి మరింత ఊపందుకున్నాయని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. 

పంగకు రెండు రోజుల ముందు నుంచే మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయని అధికారులు తెలిపారు. ఆదివారం ఒక్కరోజే రూ. 100 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం నాలుగు రోజుల్లో రూ.406 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. గతేడాది వారం రోజుల్లో రూ. 1374 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ఏకంగా రూ. 1979 కోట్ల అమ్మకాలు జరిగాయి. అయితే కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ప్రజల ఆదాయం చాలా వరకు తగ్గిపోయింది. అయినా కూడా మద్యం ప్రవాహం ఏ మాత్రం ఆగకపోవడం విశేషం.