liquor sales record in munugodu
mictv telugu

మునుగోడులో ఇన్ని కోట్ల మందు తాగేశారా !

November 5, 2022

తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి రేపిన మునుగోడు ఉప ఎన్నిక ముగిసింది. ఆదివారం ఫలితాలు కూడా వెలువడనున్నాయి.ఓటర్లు భారీగా తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.మునుగోడు ఉప ఉన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు.. తమ అభ్యర్థిని గెలిపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు పెద్ద ఎత్తున తాయిలాలు అందించి, ప్రలోభాలకు గురిచేసారు. మద్యం అయితే ఏరులై పారింది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన నుంచి మునుగోడులో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. అక్టోబర్ నెలకు సంబంధించి మునుగోడులో రూ.300 కోట్లు మేర మద్యం అమ్మకాలు జరగడం గమనార్హం.

ముందు నుంచే రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెద్దఎత్తున సాగుతుండగా.. ఇటీవల భారీగా పెరిగాయి. మరోవైపు మునుగోడు ఉపఎన్నిక కూడా తెలంగాణ ఎక్సైజ్ శాఖకు కలిసొచ్చింది. సెప్టెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖకు మద్యం అమ్మకాల ద్వారా రూ.2700 కోట్లు సమకూరితే.. అక్టోబర్ నెలలో ఈ అమ్మకాలు ఏకంగా రూ.3037 కోట్లకు చేరుకున్నాయి. ఇందులో కేవలం మునుగోడులోనే రూ. 300 కోట్ల మేరు మద్యం అమ్మకాలు జరగటం విశేషం. అబ్కారీ శాఖ లెక్కల ప్రకారం అక్టోబర్ 22వ తేదీ వరకే మునుగోడులో రూ.160.8 కోట్ల విలువ చేసే మద్యం అమ్ముడైంది. మిగతా అమ్మకాలు మొత్తం మిగిలిన ఎనిమిది పది రోజుల్లోనే జరిగినట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే.. ఏ మేర మద్యం పంపిణీ జరిగిందో అర్థమవుతుంది.