Liquor shops closed on October 2
mictv telugu

మందు బాబులకు అలర్ట్.. రేపు వైన్ షాపులు బంద్.. దాంతో పాటు ఇది కూడా

October 1, 2022

మద్యం ప్రియులకు షాకింగ్ లాంటి వార్త ఇది. రేపు అనగా ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం షాపులు బంద్ కానున్నాయి. మద్యంతో పాటు మాంసం దుకాణాలు కూడా మూసివేయబడతాయి. మహాత్మా గాంధీ జయంతి రోజును పునస్కరించుకుని ప్రతీ ఏటా అక్టోబర్ 2న ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. ప్రతీసారి లాగే ఈ సారి కూడా మద్యం, మాంసం షాపులు బంద్ అవుతాయి. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన మందుబాబులు రేపటి కోసం ఈరోజే మద్యం షాపుల వద్ద క్యూ కడుతున్నారు. పైగా ఆదివారం కావడంతో సెలవును దృష్టిలో పెట్టుకొని ఉద్యోగులు కూడా ముందుగా జాగ్రత్త పడుతున్నారు. మరికొందరు వ్యాపారులు ముందుగానే భారీగా మద్యం కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయించి మందుబాబుల బలహీనతను సొమ్ము చేసుకునేందుకు సమాయాత్తమవుతున్నారు.