Home > Featured > ఆకలి బాధితులు కాదు, మద్యం కోసమే.. కరోనా ఉచితం..

ఆకలి బాధితులు కాదు, మద్యం కోసమే.. కరోనా ఉచితం..

Liquor shops opened country wide

మద్యం షాపులు భళ్లున తెరుచుకున్నాయి. తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాలు మినహా దేశమంతటా మందుబాబులు పోటెత్తారు. గ్రీన్, రెడ్, ఆరెంజ్ జోన్లలో కొన్ని నిబంధనలతో మద్యం అమ్మకాలకు కేంద్రం పచ్చజెండా ఊపడం తెలిసిందే. రెండో లాక్‌డౌన్‌ నిన్న ముగిసి ఈ రోజ మూడో విడత మొదలైంది. నెలన్నరగా నాలుకలు పీక్కుపోయి, ఇక బతకడం ఎందుకన్న విషాదంలోంచి ఒక్కరిగా తేరుకున్న మద్యపాన ప్రియులు కార్డులు, నోట్లు జేబుల్లో కూరుకుని పోలోమని కిలోమీటర్ల కొద్దీ క్యూలలో ఎర్రటి ఎండకు మాడుతూ కాపుగాస్తున్నారు.

యూపీ నుంచి ఏపీ వరకు, కశ్మీర్ నుంచి కేరళ వరకు లిక్కర్ షాపులు ఉదయం తెరిచారు. కస్టమర్లు సంచులు పట్టుకుని మరీ క్యూలలో నిల్చున్నారు. భౌతిక దూరానికి ‘మందు వదలి’ అతుక్కుని నిలబడ్డారు. ఢిల్లీలోని బురారాలో ఓవైన్ షాపు ముందు కనిపించిన క్యూ రేషన్ షాపును తలపిస్తోంది. ఇలాగైతే కరోనా సోకడం ఖామయని వాళ్లలో వారే చర్చించుకుంటున్నారు. అయినా గత్యంతరం లేక రాసుకుపూసుకుని సాగుతున్నారు. పంజాబ్, ఛత్తీస్ గఢ్, కేరళ్లలోనూ ఇవే సీన్లు కనిపిస్తున్నాయి. భౌతిక దూరం పాటికపోతే దుకాణాలు మూసేస్తామని ప్రభుత్వం చెబుతున్నా అటు బాబులు, ఇటు షాపులు లైట్ తీసుకుని పని కానిచ్చేస్తున్నారు.

Updated : 4 May 2020 1:19 AM GMT
Tags:    
Next Story
Share it
Top