తెలంగాణ మందుబాబులకు మరో శుభవార్త..  - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ మందుబాబులకు మరో శుభవార్త.. 

June 6, 2020

Liquor shops time in telangana extends

లాక్‌డౌన్‌లో మద్యం దొరక్క అల్లాడిన తెలంగాణ మందుబాబులు కాస్త శాంతించారు. షాపులు తెరుచుకోవడంతో రెండు గుక్కలు వేసి ఊరట పొందుతున్నారు. మందు ఉచితంగా రాకపోవడం, అసలే లాక్‌డౌన్ వల్ల ఆదాయం తగ్గిపోవడంతో చాలా షాపులు బోసిపుతున్నాయి. ఫలితంగా అటు వ్యాపారులకు ఇటు ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతోంది. అందుకే అమ్ముడు సమయాన్ని కాస్త పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు రాత్రి 8.30 గంటల వరకు తెరిచే ఉంటాయని  ఉంటాయని ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. 

శుక్రవారం ఆయన ఎక్సైజ్‌శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిచారు. మద్యం క్రయవిక్రయాల అంశంపై చర్చించారు. లాక్‌డౌన్ సడలింపులో సాయంత్రం 6 గంటల వరకే షాపులు మూతపడ్డం తెలిసిందే. తర్వాత మరో సడలింపు కింద రాత్రి 8 వరకు పొడిగించారు. మందుబాబులకు మరింత అనుకూలంగా మరో గంట పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే  గీత కార్మికులకు సభ్యత్వ కార్డులు ఇవ్వాలని, సొసైటీలకు మంజూరు చేస్తే తాటి, ఈత చెట్ల కాలపరిమితిని పదేళ్లకు పెంచాలని నిర్ణయం తీసుకుంది.