మందుబాబులు తెగించేశారు.. లిక్కర్ షాపుకు బొక్కలు..   - MicTv.in - Telugu News
mictv telugu

మందుబాబులు తెగించేశారు.. లిక్కర్ షాపుకు బొక్కలు..  

April 4, 2020

మందుబాబులకు ఎక్కడా లేని కష్టాలు వచ్చిపడ్డాయి. చుక్క మద్యం దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. కొందరైతే డీ అడిక్షన్ సెంటర్లకు వెళ్తుండగా.. మరి కొందరు సిగ్గువిడిచి చోరీలకు పాల్పడుతున్నారు. ఏకంగా వైన్ షాపులకే కన్నం వేస్తూ దొరికినకాడికి దోచుకెళ్తున్నారు. హైదరాబాద్,మంగళూరులో జరిగిన ఈ చోరీలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. మద్యం కోసం దొంగతనాలకు కూడా తెగబడటం చర్చనీయాంశంగా మారింది. 

హైదరాబాద్ గాంధీనగర్‌లోని శ్రీవెంకటేశ్వర వైన్స్‌ దుకాణంలో రాత్రి దొంగలు పడ్డారు. దుకాణం వెనక నుంచి చిన్న రంధ్రం చేసుకొని లోపలికి ప్రవేశించారు. అందులో ఉన్న మద్యాన్ని తీసుకొని పారిపోయారు. చోరీకి గురైన మద్యం విలువ దాదాపు లక్ష వరకు ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకొని సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.   

మంగళూరులోని వైన్స్‌లో అయితే దొంగలు చాలా తెలివిగా ప్రవర్తించారు. ఉల్లాల్ పట్టణంలోని ఓ లిక్కర్ షాపులోకి చొరబడి మద్యం బాటిళ్లు దొంగలించారు. చోరీ చేసిన వారిని గుర్తుపట్టకుండా ఉండటానికి దుకాణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల డీవీఆర్‌ను కూడా వారి వెంట తీసుకెళ్లారు. నిర్వాహకులు వచ్చి చూడగా షాపు పగలగొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. లక్ష రూపాయల విలువ చేసే మద్యం చోరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.