మద్యం లారీ బోల్తా.. ఇదీ సీన్  - MicTv.in - Telugu News
mictv telugu

మద్యం లారీ బోల్తా.. ఇదీ సీన్ 

July 15, 2020

Liquor Transport Lorry Overturned

మద్యం బాటిళ్లు తీసుకెళ్తున్న లారీ బోల్తా పడటంతో మందుబాబులు పండగ చేసుకున్నారు. సీసాలను ఎగబడి మరీ ఏరుకుంటూ గెనె సంచుల్లో కూడా ఎత్తుకెళ్లారు. చెన్నై – తాంబరం రహదారిపై దిండిగల్ సమీపంలో బుధవారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓ వైపు గాయాలతో లారీ డ్రైవర్ బాధపడుతుంటే కనీసం అతన్ని పట్టించుకోకుండా మద్యం బాటిళ్ల కోసం ఎగబడ్డారు. ఈ తతంగాన్ని అక్కడే ఉన్న కొంత మంది స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.