బోల్తా పడ్డ లారీ.. మందుబాబులకు పండగే - MicTv.in - Telugu News
mictv telugu

బోల్తా పడ్డ లారీ.. మందుబాబులకు పండగే

May 24, 2022

మద్యం ప్రియుల అదృష్టం బాగున్నట్లుంది. ఈ మధ్య ఉచితంగా బాటిళ్లకు బాటిళ్ల మద్యం దొరుకుతోంది. ఇటీవల ఏపీలోని ప్రకాశం జిల్లాలో బీరు లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడటంతో.. అక్కడి మందుబాబులు పండుగ చేసుకున్నారు. తాజాగా నాగర్ కర్నూల్ మందుబాబుల వంతు వచ్చింది. జిల్లాలోని మంతటి చౌరస్తా వద్ద ప్రమాదవశాత్తూ మద్యం తరలిస్తున్న వాహనం బోల్తాపడింది. తిమ్మాజిపేట లిక్కర్ డిపో నుంచి రూ. 5 లక్షల మద్యం లోడుతో మినీ డీసీఎం అమ్రాబాద్ మండలం తుర్కపల్లికి వెళ్తుంది. అయితే నాగర్ కర్నూల్ మండలం మంతటి చౌరస్తా సమీపానికి రాగానే అదుపుతప్పి వాహనం బోల్తాపడింది.

దీంతో అందులో ఉన్న 40 బీర్ల కాటన్లు, 40 విస్కీ కాటన్లు రోడ్డుపై పడి చెల్లాచెదురయ్యాయి. ఇది చూసిన స్థానికులు ఎవరికి వారు అందినకాడికి మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. సుమారు రూ. 3 లక్షల మద్యం నేలపాలయ్యింది. కొంత స్థానికులు లూటీ చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణాపాయం చోటుచేసుకోలేదు. ఈ ఘటనపై నాగర్ కర్నూలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.