బికాంలో ఫిజిక్స్ .. బీర్ లో హెల్త్ ..! - Telugu News - Mic tv
mictv telugu

బికాంలో ఫిజిక్స్ .. బీర్ లో హెల్త్ ..!

July 4, 2017

మీకు హెల్త్ సరిగా ఉండట్లేదా?చాలా నీరసంగా కనిపిస్తున్నారా?వొంట్లో జోష్ కావాలా? అయితే ఏం లేదు సక్కగ వైన్ దుక్నంకోన్రి సల్లటి ఓ బీర్ తీస్కోన్రి గుటుక్కున తాగున్రి…ఇగ జింకపిల్లలెక్కనే శెంగ శెంగ దుంకుతరట,ఇదేదో ఆకాశరామన్ననో లేక్పోతే జుట్టంత వీక్కొని పరీచ్చలు జేశ్న శాత్రవేత్తలు జెప్పిన ముచ్చటగాదు…ఆంధ్రప్రదేశ్ మందు మంత్రి  శ్రీ శ్రీ శ్రీ కె ఎస్ జవహర్ సారు జెప్పిన  నగ్నబీరు సత్యం.

అంతేగాదు బీరును హెల్త్ డ్రింక్ గా ప్రమోట్ జేస్తాం..అందరూ హెల్తీగా ఉండటానికీ  తగినన్ని బీర్లు తాగేలా పోత్రహిస్తాం అని సెలవిచ్చారు సారు,మరి  ఇంత హెల్త్ గున్నడంటే సారుగుడ రోజుకు ఎన్ని బీర్లేస్తడో,గ బీరు కంపినోళ్లు ఉత్త బిత్తిరోళ్లున్నట్టున్నరు ఓ దిక్కు మంచిగ బీర్లు అమ్ముకుంటనే కింద మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని రాస్తున్నరు, సారు జెప్పిందాని ప్రకారం బీర్ల మీద హెల్త్ డ్రింక్ అని రాయాలే గదా,బీరు హెల్త్ డ్రింక్ అని ఆళ్లకు తెల్వనట్టుంది, బీరులున్న ఆరోగ్య రహస్యమేంటో మంత్రి సార్కు తెల్సింది కావట్టి..బీరు సీసలమీద హెల్త్ డ్రింకనీ జల్దిగనే రాపిస్తడు గావచ్చు.బీర్ తాగినంక  ఊగుకుంట ఇంటికోతే అయ్యవ్వల తిడ్తరని ఇకాన్నుంచి పోరగాన్లు అస్సల్కే భయపడరు గావచ్చు, నాయ్న బీర్ తాగినవారా అనంటే… అవు నాయ్న బలం బగ్గ రావాల్నని హెల్త్ మంచిగుండాల్నని నాల్గు బీర్లు తాగిన నాయ్న అని దర్జాగ చెప్తరు గావచ్చు.

మంత్రి వాఖ్యలపై పలువురు ఆగ్రహ‍ం..!

ఇగ ఈ ముచ్చట మీద ఇటు మహిళా సంఘాలు అటు ప్రతిపక్షం వైసీపోళ్లు  శిర్రుబుర్రు మంటున్రు.ఏంటిది బీరు సాంప్రదాయ హెల్త్ డ్రింకా..లైట్ బీర్ల 5%..స్ట్రాంగ్ బీర్ల 8% ఆల్కాహాల్ ఉంటదన్న ముచ్చట మంత్రి సార్కు తెల్సా తెల్వదా…బీరు హెల్త్ డ్రింకు ,సాంప్రదాయ డ్రింకు ఎట్లైతది. మంత్రిగారు అన్ని బీర్ తాగిన ముచ్చట్లు చెప్తున్నరు. వెంటనే పబ్లిక్కు ఆయన క్షమాపణ జెప్పాలె అని డిమాండ్ జేస్తున్నరు.

ప్రియతమ మంత్రి సారు… ఎలాగో బీరు హెల్త్ డ్రింక్ అన్నరు గావట్టి… బీర్లమీద ప్రత్యేక డిస్కౌంట్లో ఆఫర్లో  వెట్టిస్తిరంటే..మాకు ఆరోగ్యంకు ఆరోగ్యం..మీగవర్నమెంటుకు అమ్ధానికి ఆమ్ధాని,మీ పేరు జెప్పుకొని  ఉషార్గ ఇంకో నాల్గు బీర్లు ఎక్కోతాగి హెల్తీగుంటం అని  మొరవెట్టుకుంటరు గావచ్చు తాగుబోతున్నలు.