List Of Heroines Who Ends Their Career After Pawan Kalyan Movie
mictv telugu

పవన్ తో నటిస్తే పాతాళానికే.. ఇదే సాక్షం..!

January 7, 2023

List Of Heroines Who Ends Their Career After Pawan Kalyan Movie

రాజమౌళితో చేస్తే ఏ హీరోకైనా తదుపరి చిత్రం ఫ్లాపే. టైటిల్‌లో సింహా ఉంటేనే బాలయ్య సినిమా హిట్. మహేష్ కి మూడక్షరాల టైటిల్ మాత్రమే సూట్ అవుతుంది. టాలీవుడ్ లో ఎక్కువగా ఇలాంటి సెంటిమెంట్స్ వినిపిస్తాయి. నిజానికి ఈ సెంటిమెంట్స్ మూఢనమ్మకం అయినా ఇది జరిగిన ప్రతిసారీ నమ్మాల్సిందే. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కూడా ఒక సెంటిమెంట్ అంటగడుతూ ఒక పోస్ట్ ని వైరల్ చేస్తున్నారు యాంటీ ఫ్యాన్స్. పవన్‌ కళ్యాణ్ తో నటించే హీరోయిన్స్ కి పెద్దగా కెరీర్ ఉండదని.. త్వరగా ఫేడ్ అవుట్ అయిపోతారని.. పదిమందికి పైగా హీరోయిన్లు ఈ సెంటిమెంట్ల బారిన పడ్డారని.. లిస్ట్ ఒకటి వైరల్ అవుతుంది. ఆ లిస్టులో మాజీ భార్య రేణు దేశాయ్ నుంచి నికిషా పటేల్ వరకు చాలా మంది ఉన్నారు.

అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన సుప్రియ పవన్ డెబ్యూ మూవీ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’లో హీరోయిన్ గా నటించింది. తర్వాత ఆమె కనిపించలేదు. తమ్ముడు ఫేమ్ ప్రీతి జింగ్యానీకి కూడా అదే పరిస్థితి. ఆమె మంచి పాపులారిటీ సంపాదించిన తర్వాత కూడా తన కెరీర్‌లో ఎదగలేకపోయింది. ఇక పవన్-దేవయాని కలిసి చేసిన సుస్వాగతం సూపర్ హిట్. కానీ దేవయాని హీరోయిన్ గా సక్సెస్ కాలేదు. ఇక తొలిప్రేమ టాలీవుడ్ ఆల్ టైమ్ క్లాసిక్స్‌లో ఒకటి. కానీ ఆ సినిమా హీరోయిన్ కీర్తిరెడ్డి ఓవర్ నైట్ స్టార్ అయినా అంతే స్పీడ్ గా కనుమరుగైంది. ఇక బద్రితో రేణు దేశాయ్ భార్య అయ్యింది కానీ మంచి హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. ఇక గుడుంబా శంకర్‌ సినిమాలో పవన్‌తో జతకట్టిన మీరా జాస్మిన్‌ కూడా ఇప్పుడు ఎక్కడ కనిపించటం లేదు. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో మీరా జాస్మిన్ కెరీర్ కూడా స్పాయిల్ అయిపోయింది.

ఇక బంగారం మూవీతో బరిలోకి దిగిన మీరా చోప్రా కెరీర్ కూడా కష్టాలే. బంగారం డిజాస్టర్ కావటంతో మీరా చోప్రా కెరీర్‌ క్లోజ్ అయిపోయింది. జల్సాలో నటించిన ఇలియానా కెరీర్ కూడా కళ్ల ముందే కనిపించకుండా పోయింది. బాలీవుడ్ అంటూ ముంబైకి మకాం మార్చిన తరువాతా పరిస్థితులు తారుమారయ్యాయి. పవన్ సెంటిమెంట్లకు పడిపోయిన మరో యంగ్ హీరోయిన్ నికిషా పటేల్. పవన్ అట్టర్ ఫ్లాప్ మూవీ కొమరం పులిలో నటించిన నికిషా మళ్ళీ కోలుకోలేదు. పులి తరువాత నికిషా పటేల్‌కు చెప్పుకోదగ్గ అవకాశాలు రాకపోవటంతో ఇండస్ట్రీ నుంచి బయటకి వెళ్ళిపోయింది. ఇక పంజా సినిమాలో పవన్‌కి జోడీగా కనిపించిన సారా, అంజలి లావణ్య.. అజ్ఞాతవాసిలో నటించిన అను ఇమ్మాన్యుయేల్ ల పరిస్థితి దేవుడికే తెలియాలి. ఇలా పవన్ తో నటించిన తర్వాత పది మందికి పైగా హీరోయిన్లు ఇండస్ట్రీకి దూరమయ్యారు.