List of Theatre movies and OTT Web series Releasing in November 2nd week
mictv telugu

ఈ వారం పండగే..థియేటర్స్..ఓటీటీ చిత్రాలు ఇవే..

November 8, 2022

ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు విడుదల కాకపోవడంతో చిన్న సినిమాలకు జాక్ పాట్ దొరికింది. వారానికి ఏకంగా నాలుగు, ఐదు సినిమాలు ప్రేక్షుకులను పలకరిస్తున్నాయి. అటు ఓటీటీలోనూ..ఇటు థియటర్స్‌లోను సందడి చేస్తున్నాయి. ఈ వారం కూడా పలు చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్నాయి. అయితే ఈ సారి సమంత ‘యశోద’, అమితాబచ్చన్ వంటి స్టార్స్ నటించిన ‘ఊంచాయి’ వంటి చిత్రాలు ఉండడం అభిమానులకు పండగే.

యశోద:

తెలుగు చిత్రాల్లో తన వేగం తగ్గించిన సమంత ఈ సారి యశోద తో ముందుకొస్తోంది. జాను తర్వాత సమంత నేరుగా తెలుగులో నటిస్తోన్న చిత్రం కూడా యశోద కావడంతో ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌, ఉన్ని ముకుందన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హరి, హరీష్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రం నవంబర్ 11న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

నచ్చింది గర్ల్‌ ఫ్రెండూ:

సస్పెన్స్, థ్రిల్లింగ్ లవ్ స్టోరీతో ఈ వారం వస్తున్న మరో చిత్రం ‘నచ్చింది గర్ల్‌ ఫ్రెండూ’. ఆటగదరా శివ, మిస్ మ్యాచ్ చిత్రాలతో మెప్పించిన ఉదయ శంకర్ చిత్రంలో హీరోగా నటించగా.. జెన్నీఫర్ హీరోయిన్‌గా నటించింది. గురు పవన్ దర్శకత్వంలో అట్లూరి నారాయణరావు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కూడా ఈనెల 11నే థియేటర్లో సందడి చేయనుంది.

ఊంచాయి :
బాలీవుడ్‌ హేమాహేమీలు అమితాబ్‌బచ్చన్‌, అనుపమ్‌ ఖేర్‌, బొమన్‌ ఇరానీ, నీనా గుప్తాలు నటించిన చిత్రం ఊంచాయి. పరిణీతి చోప్రా, సారిక కీలక పాత్రలు పోషించారు. మైనే ప్యార్‌కియా, హమ్‌ ఆప్కే హై కౌన్‌, వివాహ్‌, ప్రేమ్‌రతన్‌ దన్‌ పాయో వంటి ప్రేమకథా కుటుంబ చిత్రాలను తెరెక్కించిన సూరజ్‌ బర్జాత్య దీనికి దర్శకత్వం వహించారు. నవంబరు 11న ఈ సినిమా థియేటర్లలో అడుగుపెట్టనుంది.

మది :


నూతన హీరో, హీరోయిన్లు శ్రీరామ్‌ నిమ్మల, రిచా జోషి జంటగా నటించిన ‘మది’ అనే లవ్ ఎంటర్‌టైనర్‌ కూడా ఈ వారం రానుంది. పెద్ద సినిమాలతో సహా ఈనెల 11ను విడుదల కానుంది. నాగధనుష్ దర్శకత్వం వహించగా.. రామకిషన్ నిర్మాతగా వ్యవహరించారు.

ఇక ఎప్పటిలాగే ఆకట్టుకునే కంటెంట్‌తో ఓటీటీలో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సిద్ధంగా ఉన్నాయి.

ఓటీటీలో సినిమాలు/ వెబ్‌ సిరీస్‌లివే..

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

* బ్రీత్‌ : ఇన్‌ టు ది షాడోస్‌ (హిందీ సిరీస్‌2)- నవంబరు 9
*ఇరావిన్‌ నిగళ్‌ (తమిళ్‌ సినిమా)- నవంబరు 11
* సిక్సర్‌ (హిందీ వెబ్‌ సిరీస్‌)- నవంబరు 11

నెట్‌ఫ్లిక్స్‌

*బిహైండ్‌ ఎవ్రీ స్టార్‌ (కొరియన్‌ సిరీస్‌)- నవంబరు 8
*ద క్లాజ్‌ ఫ్యామిలీ 2 (డచ్‌ సిరీస్‌)- నవంబరు 8
*ట్రివియా వర్స్‌ (హాలీవుడ్‌)- నవంబరు 8
*ద క్రౌన్‌ (వెబ్‌ సిరీస్‌)- నవంబరు 9
*ఫాలింగ్‌ ఫర్‌ క్రిస్మస్‌ (హాలీవుడ్‌ )- నవంబరు 10
*లాస్ట్‌ బుల్లెట్‌ (ఫ్రెంచ్‌ మూవీ)- నవంబరు 10
*వారియర్‌ నన్‌ (వెబ్‌సిరీస్‌)- నవంబరు 10
*మోనికా ఓ మై డార్లింగ్‌ (హిందీ)-నవంబరు 11
*ఏన్సెంట్‌ అపోకలిప్స్‌ (వెబ్‌సిరీస్‌)- నవంబరు 11
*థాయ్‌ మసాజ్‌ (హిందీ)- నవంబరు 11

డిస్నీ పస్ల్‌ హాట్‌స్టార్‌
*సేవ్‌ ఔర్‌ స్క్వాడ్‌ (ఒరిజినల్‌ సిరీస్‌)- నవంబరు 09
*మనీ మాఫియా (హిందీ సిరీస్‌)- నవంబరు 10
*రోస్‌చాక్‌ (తెలుగు)- నవంబరు 11

జీ5
*ముఖ్‌బీర్‌ (హిందీ సిరీస్‌)- నవంబరు 11

సోనీ లివ్‌
*తనావ్‌ (హిందీ సిరీస్‌)- నవంబరు 11

లయన్స్‌ గేట్‌ ప్లే
* హాట్‌సీట్‌ (హాలీవుడ్‌)- నవంబరు 11