List of upcoming movies in theaters and OTTs this week
mictv telugu

ఈ వారం థియేటర్, ఓటీటీలలో వచ్చే చిత్రాల లిస్ట్

June 28, 2022

ఓ వైపు రుతుపవనాల రాకతో పుంజుకుంటున్న వ్యవసాయం, మరోవైపు పాఠశాలల ప్రారంభంతో స్కూళ్లకు తరలివెళ్తున్న విద్యార్ధుల సందడి మధ్య కొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం వచ్చే చిత్రాలేంటో చూద్దాం.
1. పక్కా కమర్షియల్ : యాక్షన్ చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న హీరో గోపీచంద్, తనదైన కామెడీతో చిత్రాలు తీసే దర్శకుడు మారుతిల కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం జులై 1న థియేటర్‌లో
సందడి చేయనుంది. రాశీఖన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకోగా, చిత్ర విజయంతో జులై నెలను ఘనంగా ప్రారంభించేందుకు రెడీ అవుతోంది.
2. రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్ : ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణ జీవిత కథ ఆధారంగా నటుడు మాధవన్ స్వీయ దర్శకత్వంలో చేసిన ఈ చిత్రం కూడా జులై 1న రిలీజ్ కానుంది. సిమ్రాన్ కథానాయికగా నటించిన ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సీబీఐ మాజీ అధికారుల మెప్పు పొందిన ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.
3.ఏనుగు : అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్‌ల కాంబినేషన్‌లో సింగం సినిమాల దర్శకుడు హరి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఏనుగు. తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేస్తున్న ఈ చిత్రం కూడా జులై 1న విడుదలవుతోంది.
4. గంధర్వ : సందీప్ మాధవ్, గాయత్రి జంటగా, సాయి కుమార్, సురేష్, బాబు మోహన్ కీలక పాత్రలో నటించిన చిత్రం జులై 1న థియేటర్‌లో రిలీజ్ అవుతోంది. యాంటీ ఏజింగ్ అనే విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ఏమేరకు విజయం సాధిస్తుందో చూడాలి.
5. 10th class డైరీస్
6. షికారు వంటి చిత్రాలు ప్రేక్షకుల తీర్పుకోసం రానున్నాయి.
ఇక ఓటీటీ విషయానికి వస్తే థియేటర్‌లో రిలీజ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకోని కంగనా రనౌత్ థాకడ్ జీ5లో జులై 1న విడుదల అవుతోంది. అలాగే అక్షయ్ కుమార్ నటించిన చారిత్రాత్మక చిత్రం సామ్రాట్ పృథ్వీరాజ్ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో జులై 1 విడుదల కానుంది. ఇదికాక, ప్రముఖ నిర్మాత శోభూ యార్లగడ్డ నిర్మించిన వెబ్ సిరీస్ ‘అన్యాస్ ట్యుటోరియల్’ ‘అహా’ వేదికగా రానుంది. రెజీనా, నివేదితా సతీష్ ప్రధాన పాత్రలు పోషించగా, తమిళ, తెలుగు భాషల్లో జులై 1న విడుదల అవుతుంది. ఇక అమెజాన్ ప్రైమ్‌లో ద టెర్మినల్ లిస్ట్ (తెలుగు) జులై 1, నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 28న బ్లాస్టెడ్, జీ5లో షటప్ సోనా (హిందీ) జులై 1, మియా బీబీ ఔర్ మర్డర్ జులై 1న రిలీజ్ కానున్నాయి.