ఎవరు చెప్పిన విన.. సభ పెట్టే తీరుతా: అనిల్ - MicTv.in - Telugu News
mictv telugu

ఎవరు చెప్పిన విన.. సభ పెట్టే తీరుతా: అనిల్

April 16, 2022

anil

”ఎట్టి పరిస్థితుల్లో సభను నిర్వహించే తీరుతా. ఎవరు చెప్పినా వినను. ఇది ఎవరికీ పోటీ సభ కాదు. మూడు రోజుల ముందే సభకు అనుమతి తీసుకున్నా. సభను వాయిదా వేసుకోవాలని పార్టీ హైకమాండ్ నాకు చెప్పలేదు. ఎవరో కార్యక్రమం పెట్టుకున్నారని, నేను సభను పెట్టడం లేదని చెప్పారు” అని మాజీ వైసీపీ మంత్రి అనిల్ కూమార్ యాదవ్ అన్నారు.

ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా నెల్లూరు జిల్లా వైసీపీలో అంతర్గత పోరు మొదలైందా అని కార్యకర్తలు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలే మంత్రిగా కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే, మంత్రి అయిన తర్వాత ఈనెల 17న తొలిసారిగా నెల్లూరు జిల్లాకు విచ్చేస్తున్నారు. అదేరోజు కార్యకర్తలతో భారీ సమావేశం నిర్వహించేందుకు అనిల్ ప్లాన్ చేస్తున్నారు. కాకాణికి స్వాగతం పలికే రోజేనే అనిల్ కూమార్ యాదవ్ కార్యకర్తలతో సమావేశం పెట్టడం ఏంటీ? దీని వెనుక వ్యూహం ఏముంది? అనే విషయాలపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో శనివారం అనిల్ మీడియాతో మాట్లాడుతూ..”బల ప్రదర్శన కోసం సమావేశం నిర్వహించడం లేదు. కేవలం సిటీ నియోజకవర్గం కార్యకర్తలు మాత్రమే సభకు హాజరవుతారు. నా సభను కొందరు వివాదంగా మారుస్తున్నారు. నేను జగన్‌కు సైనికుడిగానే ఉంటా. సభను వాయిదా వేసుకోవాలని అధిష్టానం సూచించలేదు” అని అనిల్ వివరించారు. దీంతో కార్యకర్తల్లో టెన్షన్ మొదలైంది. ఒకేరోజు రెండు సభలు జరుగుతుండడంతో ఏం జరుగుతుందో అని భయాందోళనకు గురవుతున్నారు.