ప్రముఖ తమిళ హీరో విజయ్ తాజాగా నటించిన బీస్ట్ చిత్రం ఈరోజు విడుదలైంది. ఈ సందర్భంగా అభిమానులు ఉదయం నుంచే థియేటర్ల వద్ద హంగామా స్టార్ట్ చేశారు. పలు థియేటర్లలో అభిమానుల కోసం ఉదయం నాలుగు గంటలకు మొదటి షో వేశారు. అరబిక్ కుత్తు వంటి సూపర్ హిట్ సాంగ్ ఉండడంతో అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చెన్నైలో విజయ్ అభిమానులు విజయ్ మక్కళ్ ఇయక్కం తరపున సినిమా చూసే ప్రేక్షకులకు లీటరు పెట్రోలును ఫ్రీగా ఇస్తున్నారు. మరికొన్ని థియేటర్లలో 5 టిక్కెట్లు బుక్ చేసుకున్నావారికి లీటరు పెట్రోల్ ఇస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం ఓ ప్రైవేటు కంపెనీ అయితే ఏకంగా సెలవే ప్రకటించింది. ఇదిలా ఉండగా, బీస్ట్ సినిమా బాగాలేదంటూ హర్ట్ అయిన అభిమానులు తమిళనాడులో ఏకంగా థియేటర్ స్క్రీన్‌కే నిప్పు పెట్టేశారు. ఎన్నో ఆశలతో సినిమాకు వస్తే నిరాశకు గురిచేసిందని, అందుకే నిప్పు పెట్టామని చెప్తున్నారు. నిప్పు పెట్టిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Frustrated Vijay fans firing Theatres Screens #BeastDisaster
— 🔥 Ajith Kumar🔥 (@Anythingf4AJITH) April 13, 2022