లీటర్ పెట్రోల్, నిమ్మకాయలు ఫ్రీ అంటున్న మొబైల్ షాప్ - MicTv.in - Telugu News
mictv telugu

లీటర్ పెట్రోల్, నిమ్మకాయలు ఫ్రీ అంటున్న మొబైల్ షాప్

April 21, 2022

prr

కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి వ్యాపారస్థులు అనేక ఆఫర్లు ప్రకటిస్తుంటారు. తద్వారా అమ్మకాలు బాగా జరిగి లాభాలు ఆర్జించవచ్చన్నది వారి ఆలోచన. ఈ నేపథ్యంలో ఓ మొబైల్ షాప్ యజమాని ప్రకటించిన ఆఫర్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసికి చెందిన ఓ దుకాణాదారుడు తన షాపులో రూ. 10 వేలకు పైన మొబైల్ ఫోన్ కొనుక్కుంటే లీటర్ పెట్రోల్ ఉచితంగా ఇస్తానని ప్రకటించాడు. అంతేకాక, మొబైల్ యాక్సెసరీస్ కొంటే ఐదు నిమ్మకాయలు ఫ్రీగా ఇస్తానంటూ ఆఫరిచ్చాడు. ప్రస్తుతం పెట్రోల్, నిమ్మకాయల రేట్లు భారీగా పెరిగినందును వినియోగదారులను తన ప్రకటన ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని షాపు యజమాని భావన.