ఈ పిల్ల ముందు ‘మహానటి’ కూడా దిగదుడుపే..  - MicTv.in - Telugu News
mictv telugu

ఈ పిల్ల ముందు ‘మహానటి’ కూడా దిగదుడుపే.. 

September 16, 2020

Little girl pretends hand struck up in water can neck

నటనలో రాటుదేలితే ‘మహానటుడు’ అంటాం. ఆడవాళ్లను ‘మహానటి’ అంటారు. సావిత్రిని మహానటి అని మురిపెంగా పిలుచుకుంటారు. ఇదంతా పెద్దల సంగతి. మరి పిల్లలు నటనలో ఆరితేరితే? పిల్లంటే ఐదేళ్లు, పదేళ్లు, పదిహేనేళ్ల పిల్లలు అనుకునేరు.. కానే, కాదు.. ఏడాది దాటిని పసికూన దిమ్మతిరిగేలా నటిస్తే? ఏమని పిలవాలి? 

ఈ వీడియో చూస్తే ఆ చిన్నారి టాలెంట్ అర్థమవుతుంది. మాటలు కూడా సరిగ్గా రాని, తప్పటడుగులు వేస్తున్న బుజ్జమ్మ ప్రదర్శించిన నటవిశ్వరూపం అన్నమాట. వాటర్ క్యాన్‌ గొంతులో చెయ్యి పెట్టి ఇరుక్కుపోయినట్లు యాక్షన్ చేస్తుంది. చెయ్యి నలిగిపోతున్నట్లు తెగ పోజు పెడుతుంది. నిజంగా ఇరుక్కుపోయిందేమోనని వాళ్ల నాన్న ఆ పిల్ల చెయ్యిని క్యాన్‌లోచి తీసేస్తాడు. ఆ పాప ‘అంతా ఉత్తిదే’ కిలకిలా నవ్వుతుంది. తర్వాత మళ్లీ క్యాన్‌లో చేయి పెట్టి ఏడుస్తుంది. ‘ఇక చాల్లే..’ అన్నట్లు తండ్రి ఆ పిల్ల చెయ్యి తీస్తాడు. తర్వాత బుడిబుడి అడుగులు వేస్తూ వెళ్లిపోతుంది. ఈ వీడియోను చూసిన జనం ఆ పిల్లకు ఫిదా అంటున్నారు. బాలనటి అవార్డు ఇచ్చి తీరాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది పాతవీడియో అయినా ట్విటర్, వాట్సాప్‌లో మళ్లీ వైరల్ అవుతోంది.