Little girl with only Rs 10 in hand ordered a burger at a restaurant.
mictv telugu

రూ. 10 తెచ్చి బర్గర్ కావాలన్న చిన్నారి.. దేవుడిలా అతడు..

October 22, 2022

Little girl with only Rs 10 in hand ordered a burger at a restaurant.

ఆకలి బాధమేమిటో అనుభవించిన వారికే తెలుస్తుందంటారు. అందుకే అన్నదానికి మించిన దానం లేదంటారు పెద్దలు. దురదృష్టం ఏమింటంటే ఈ ప్రపంచంలో ధాన్యపు రాశులు మూలుగుతుంటే ఒకపక్క, మరోపక్క ఆకలి కేకలు మార్మోగుతున్నాయి. పిడికెడు తిండికోసం చేతులు చాస్తున్న కోట్ల మంది మన దేశంలో ఉన్నాయి. ఆ బాలిక కూడా ఆకలి బాధితురాలే. కానీ ఆత్మాభిమానం నిండుగా ఉంది. మార్కెట్ ధరలు మాత్రం తెలియదు. అందుకే తన దగ్గరున్న 10 రూపాయలతో ఖరీదైన రెస్టారెంటుకు వచ్చింది. అందంగా కనిపిస్తూ నోరూరిస్తున్న బర్గర్ కావాలని ఆశపడింది. దాని ఖరీదు ఎంతో తెలియకపోయినా 10 రూపాయలు ఇస్తే తనకు ఆ బర్గర్ ఇస్తారని అమాయకంగా ఆ నోటు అక్కడి సేల్స్ మ్యాన్‌కు అందించింది.

ఆ చిన్నారి ఆకలి ముఖం, ఆ నలిగిన నోటు చూసి అతని గుండె తరుక్కుపోయింది. ఆమె కోరిన బర్గర్ ధర రూ. 90. ఆమె ఇచ్చిన 10కి అమ్మడం నిబంధనలకు విరుద్ధం. అతనిలో మానవత్వం వెల్లివిరిసింది. తన పర్సులోంచి మిగతా రూ. 80 తీసి, ఆ 10కి జతకలిపి కౌంటర్లో డబ్బులిచ్చి బర్గర్‌ను అందించాడు. ఆ చిన్నారి మెరిసే కళ్లతో అందుకుని వెళ్లిపోయింది. అతని మంచితనం కంపెనీకి తెలిసి ప్రశంసించింది. చిన్నపాటి అభినందన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసింది. నోయిడా బొటానికల్ గార్డెన్ మెట్రోస్టేషన్‌లోని బర్గర్ కింగ్ రెస్టారెంటులో ఈ ఉదంతం చేసుకుంటుంది. ఆ ఉద్యోగి పేరు ధీరజ్ కుమార్. చిన్నారి రూ. 10 ఫోటో పట్టుకుని నిల్చున్న ఫొటోతోపాటు ధీరజ్ ఫోటోలు కూడా సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి.