ఆరేళ్లకే పైలెట్! - MicTv.in - Telugu News
mictv telugu

ఆరేళ్లకే పైలెట్!

October 25, 2017

ప్రతిభ ఉండాలేగాని వయసుతో పనేముంది! యునైట్ అరబ్ ఎమిరేట్స్‌కు చెంది ఆరేళ్ల ఆడమ్ అనే బుజ్జోడు ఏకంగా పైలట్ అవతారమెత్తేశాడు. అంటే వేషం కాదండోయ్. నిజంగానే విమానం నడిపేస్తానంటున్నాడు.


దీనికి కావలసిన శిక్షణంతా తీసుకున్నాడు. కేవలం యూట్యూబ్ వీడియోలను చూసి విమానం నడపడం ఎలాగో నేర్చుకున్నాడు. అంతేకాదు.. విపత్తు ఎదురైతే ఎలా వ్యవహరించాలో కూడా తెలుసుకున్నాడు.

ఆడమ్ ప్రతిభ గురించి తెలుసుకున్న ఎతిహాద్ ఎయిర్‌వేస్‌లో సంస్థ  ఒక రోజు పైలట్‌గా పనిచేయించింది అతనితో. అతన్ని శిక్షణా కేంద్రానికి పిలిపించుకుని  పైలట్‌ ట్రైనింగ్‌ ఇచ్చింది.  ప్రత్యేక యూనిఫామ్‌ను ధరించిన ఆడమ్ పైలట్ మాటలు మాట్లాడుతూ అందరికీ అబ్బురపరిచాడు. పెద్ద పైలట్ ఒకరు తోడుగా ఉండగా ఆ చిన్నారి కాక్ పిట్‌లో కూర్చుని విమాన ఆపరేటింగ్ వ్యవస్థలపై ముద్దుముద్దు మాటలతో వివరణ ఇవ్వడం చూపరులకు విస్మయం కలిగిస్తోంది. ఆ సమయంలో తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. దీనని ఇప్పటికే రెండున్నర కోట్ల మంది చూశారు. ఏ380 ఎయిర్‌బస్‌ కెప్టెన్‌ కావాలన్నదే తన కలని ఆడమ్‌ చెప్పాడు.