పసి పిల్లలకు భయమంటే ఎందో తెలియదు. ఏది కనిపిస్తే దాన్ని పట్టేస్తుంటారు. చీమలైనా, పాములైనా పరుగెత్తి మరి పట్టేసేకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలాగే ఆస్ట్రేలియాలో ఓ బుడ్డొడు పాములతో ఆడుకుంటున్నాడు. ఆ విష సర్పాలను చూస్తే..పెద్దోళ్లు పారిపోతున్నారు కానీ …లిటిల్ స్నేక్ బాయ్ మాత్రం భయపడటం లేదు.
ఈ పోరగాడి పేరు జెన్సన్ హరిసన్ వయసు రెండేళ్లు. పాములే ఆటబొమ్మలు. జెన్సన్కి పాములంటే భయం లేదు. దానికి కారణం అతని తల్లిదండ్రుల వృత్తి పాములు పట్టడం. వాటిని పట్టి అమ్మగా వచ్చే డబ్బులతోనే బతుకుతారు. అంతేకాకుండా వాళ్లింట్లో 300కి పైగా పాములను పెంచుతున్నారు. దీంతో జెన్సన్కు వాటితో ఆడుకుంటున్నాడు. వాటిల్లో కొండచిలువ.. బల్లి జాతికి చెందిన గొవన్నాతో ఆడుకోవడం అంటే ఇష్టమట. జెన్సన్ పుట్టిన రెండో రోజునే ఓ పాముపిల్లని పట్టుకున్నాడని అతని తల్లిదండ్రులు అంటున్నారు. పాములను పట్టుకునే ఫొటోలను ఇన్స్టాగ్రామ్ ఖాతాలోనూ పోస్టు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.