సహజీవనం పెళ్లితో సమానం... రాజస్థాన్ హైకోర్టు - MicTv.in - Telugu News
mictv telugu

సహజీవనం పెళ్లితో సమానం… రాజస్థాన్ హైకోర్టు

May 8, 2019

రాజస్థాన్‌ హైకోర్టు ఓ కేసులో ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా సంచలనం అవుతోంది. ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న వివాహిత, సహ ఉపాధ్యాయుడు బలరాంతో ఐదేళ్లుగా సహజీవనం చేస్తోంది. బలరాం మాయ మాటలు నమ్మిన ఆమె భర్తకు విడాకులు ఇచ్చేసింది. కానీ ఆమెను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. బలరాంకు ఐటీ ఉద్యోగం రావడంతో ఉపాధ్యాయురాలిని వదిలేసి మరో అమ్మాయిని వలలో వేసుకున్నాడు.

‘Live-in Relation in India Like Marriage,’ Rules Rajasthan High Court

బలరాం లాంటి వాళ్లను ఊరికే వదలకూడదు అనుకున్న ఉపాధ్యాయురాలు రాజస్థాన్ హైకోర్టులో కేసు వేసింది. కేసు విచారించిన హైకోర్టు బలరాంకు షాక్ తగిలే తీర్పు ఇచ్చింది. సహజీవనం చేయడమంటే భారత సమాజంలో పెళ్లి చేసుకున్నట్లేననీ, సమాజం దాన్ని వివాహంగానే తప్ప మరోవిధంగా పరిగణించదు అని రాజస్థాన్‌ హైకోర్టు అభిప్రాయపడింది. కొన్నేళ్లుగా ఒక అమ్మాయితో సహజీవనం చేసి, తర్వాత మరో యువతితో పెళ్లికి సిద్ధమైన బలరాం ప్రయత్నాలకు కోర్టు బ్రేక్ వేసింది. ఇప్పుడు ఆ ఉపాధ్యాయురాలికి భర్త లేడు. బలరాంతో మనస్శాంతిగా జీవించే పరిస్థితీ లేదు. భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోయింది.