శేషజీవితాన్ని మారుమూల పల్లెలో గడిపేస్తా.. రేణూదేశాయ్ - MicTv.in - Telugu News
mictv telugu

శేషజీవితాన్ని మారుమూల పల్లెలో గడిపేస్తా.. రేణూదేశాయ్

March 28, 2020

Live the rest of the life in a remote village ..

తన పిల్లలు కాలేజీలో చేరిన తర్వాత మిగిలిన శేష జీవితాన్ని కూరగాయలు పండిస్తూ మారుమూల గ్రామంలో గడపాలని బలంగా కోరుకుంటున్నానని.. నటి, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ తెలిపారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. ఓ పది పిల్లులు, 10 శునకాలు, భారీ మొత్తంలో మూగజీవాలు, లెక్కలేనన్ని పుస్తకాలు.., ఇవి ఉంటే తనకు స్వర్గంలో ఉన్నట్టే ఉంటుంది అని పేర్కొన్నారు. త్వరలోనే ఆరోజు వస్తుందని ఆకాంక్షించారు. వికారాబాద్‌లోని ఓ గ్రామంలో చిన్నపిల్లలతో సరదాగా గడిపిన ఓ వీడియోను రేణు పంచుకున్నారు. చిన్న పిల్లలతో చేతి వేళ్లతో ఫోజులు పెట్టిస్తూ ఆనందంగా గడిపారు. ఆవులు, మేకలు, కాకులు, కొంగల వీడియోలను తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసి పల్లె జీవితాన్ని మిస్ అవుతున్నానని వాపోయారు.  

అయితే ఆమె వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. కరోనా వ్యాప్తి ఉండగా బయట తిరగొద్దు అని కామెంట్ చేశాడు. అతనికి బదులిస్తూ.. ఇవి ఇంతకుముందు తీసిన వీడియోలని.. క్యాప్షన్‌ చూసి కామెంట్లు పెట్టాలని రేణుదేశాయ్‌ అతనికి రిప్లై ఇచ్చారు.