living together couple siddharth aditi rao caught in mumbai
mictv telugu

ఎట్టకేలకు ఆ స్టార్ హీరోయిన్ తో.. మీడియాకి దొరికిపోయిన హీరో సిద్దార్థ్

December 1, 2022

సౌత్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ లవర్ బాయ్ హీరో సిద్దార్థ్. నాలుగు పదుల వయసులోనూ వరుసగా హీరోయిన్స్ తో డేటింగ్ చేస్తుంటాడు. ఇప్పటికే పెళ్ళై విడాకులు కూడా తీసుకున్నాడని రూమర్స్ ఉన్న సిద్దార్థ్ డేటింగ్ లిస్ట్ చాల పెద్దది. త్రిష, సమంత, శృతి హాసన్, సోహా అలీ ఖాన్ వంటి స్టార్ హీరోయిన్స్ తో సిద్ధుకి రిలేషన్స్ ఉన్నట్టు వార్తలున్నాయి. అయితే ఈ లిస్టులో కొద్దీ రోజుల నుండి మరో స్టార్ హీరోయిన్ పేరు వినపడుతూ వస్తుంది. ఆమె మరెవరో కాదు మణిరత్నం హీరోయిన్ గా పేరున్న అదితి రావు. ముంబైలో సిద్దార్థ్, అదితిరావులు సహజీవనం చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ముంబై స్ట్రీట్స్ లో తిరుగుతున్నారని, చెన్నై వీధుల్లో పార్టీలు చేసుకుంటున్నారని వదంతులు వచ్చినా ఇప్పటివరకు ఎక్కడ కూడా ఈ జంట బాహాటంగా కనిపించలేదు.

అయితే తొలిసారి ఈ లవ్ కపుల్ మీడియాకి అడ్డంగా దొరికేశారు. తాజాగా ముంబైలో కలిసి చెక్కర్లు కొడుతూ ఈ ప్రేమ జంట కెమెరా కంటికి చిక్కారు. దాంతో గత కొద్దిరోజులుగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారన్న కథనాలని నిజం చేస్తూ.. ముంబై హోటల్లో ఈ జంట కనిపించి ఆ వార్తలకు బలం చేకూర్చారు. అయితే ఇప్పటికే సిద్దార్థ్ తో పాటు అతిధి రావ్ హైదరీలకు విడివిడిగా పెళ్లిళ్లు జరిగాయి. సిద్ధార్థ 2003లో మేఘన అనే అభిమానిని వివాహం చేసుకొని 2007లో విడాకులు ఇచ్చారని, అతిథి కూడా చిన్నవయసులోనే సత్యదేవ్ మిశ్రా అనే వ్యక్తిని రహస్య వివాహం చేసుకుందని, ఆ తర్వాత అతనితో విడాకులు తీసుకుందని అంటుంటారు. అయితే ఇలాంటి వీరిద్దరూ ఇప్పుడు కలిసి మళ్ళీ డేటింగ్ చేయడం సంచలనంగా మారింది.