కోల్డ్ డ్రింక్‌లో బల్లి.. మెక్‌డొనాల్డ్‌కు లక్ష జరిమానా - MicTv.in - Telugu News
mictv telugu

కోల్డ్ డ్రింక్‌లో బల్లి.. మెక్‌డొనాల్డ్‌కు లక్ష జరిమానా

June 8, 2022

ప్రముఖ ఆహార విక్రయ సంస్థ మెక్‌డొనాల్డ్‌కు గుజరాత్ అహమ్మదాబాద్ కార్పొరేషన్ రూ. లక్ష జరిమానా విధించింది. కోల్డ్ డ్రింక్ పోసిన గ్లాసులో చనిపోయిన బల్లి రావడంతో వినియోగదారుడు ఫిర్యాదు చేయగా, వెంటనే స్పందించిన కార్పొరేషన్ అధికారులు అవుట్‌లెట్‌ని తనిఖీ చేసి పై మేరకు స్పందించారు. అంతేకాక, షాపును మూడ్రోజుల పాటు తనిఖీ చేసి సీలు వేశారు. మళ్లీ కార్పొరేషన్ పర్మిషన్ ఇస్తే తప్ప తెరవరాదని ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు బల్లి కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. భార్గవ్ అనే వ్యక్తి కోల్డ్ డ్రింక్ ఆర్డర్ చేయగా అందులో బల్లి కనిపించడంతో అవుట్ లెట్ మేనేజరుకి ఫిర్యాదు చేశాడు. నాలుగు గంటలైనా స్పందించపోవడంతో వీడియో తీసి వైరల్ చేశాడు. ఆ తర్వాత దిగివచ్చిన యాజమాన్యం రూ. 300 ఇస్తామని బ్రతిమిలాడగా, వినని భార్గవ్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం అధికారులు సీజ్ చేసి కోల్డ్ డ్రింక్ నమూనాలను పరీక్షల కోసం లాబోరేటరీకి పంపారు. రిపోర్టు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.