రాష్ట్రపతి అవుతారనుకుంటే..బోనెక్కించారు..! - MicTv.in - Telugu News
mictv telugu

రాష్ట్రపతి అవుతారనుకుంటే..బోనెక్కించారు..!

May 30, 2017


కేంద్రంలో వాళ్ల పార్టీదే అధికారం..బీజేపీలో సీనియర్ మోస్ట్ లీడర్..ఆ పార్టీ కార్యకర్తలకు అద్వానీ అంటే పిచ్చా అభిమానం. అంతా రాష్ట్రపతి అవుతారనుకున్నారు.కానీ కథ అడ్డం తిరిగింది. రాష్ట్రపతి భవన్ కు వెళ్లాల్సిన అద్వానీ..ఎందుకు కోర్టు మెట్లు ఎక్కారు. కాదు కాదు.. కోర్టు మెట్లు ఎక్కించిందెవరు.

నరేంద్రమోదీ..డైనకమిక్ పీఎం. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోన్న సూపర్ పీఎం..ఇందులో నో డౌట్. కానీ పార్టీ లో వన్ మ్యాన్ షో నడుపుతూ సీనియర్లను ఎందుకు దేకడం లేదు. అద్వానీ అంటే మరి ఎందుకంత అలుసు.బీజేపీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఇక్కడ కష్టపడేవారికి ఓ గుర్తింపు ఉంటుందనే పేరుంది. అద్వానీ విషయంలో అది ఏమైంది.ఎందుకిలా చేస్తున్నారు. నిజమైన బీజేపీ కార్యకర్తకు అద్వానీని చూస్తే కన్నీరు ఆగదు. నరేంద్రమోదీపై అభిమానం ఉన్నా..ఎందుకిలా చేస్తున్నారని ఆవేదన చెందుతారు. సీనియర్లు నచ్చకపోతే పక్కన పెట్టడంలో కాంగ్రెస్ ది ఓ టైపాప్ కల్చర్. నచ్చని వాళ్లని , గిట్టని వాళ్లని తనదైన స్టయిల్లో సోనియా పక్కనబెట్టేవారు. సామ,దాన,బేధ ,దండోపాయల్ని ఉపయోగించేవారు. ఇది

సొంతపార్టీవాళ్లైనా..ప్రత్యర్థులైనాఇంతే. ఊ అంటే..ఆ అంటూ సీబీఐ అస్త్రాన్ని ప్రయోగించేవాళ్లు..ఇప్పుడీ కల్చర్ కు బీజేపీ మినహాయింపు కాదనిపిస్తోంది. సాధారణంగా ఏ పార్టీ అధికారంలో ఉన్న ఆ పార్టీ లో సీనియర్లకు కోర్టు కష్టాలు చాలా అరుదు. కానీ రాష్ట్రపతి కావాల్సిన అద్వానీ కోర్టు మెట్లు ఎక్కారు. పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్న ఆయనకు సముచిత గౌరవం దక్కలేదు. పార్టీ మీటింగుల్లో ఆయన్ను పట్టించుకోవట్లేదు. పార్టీ నిర్ణయాల్లో ఆయన్ను సంప్రదించడం లేదు. బీజేపీలో ..కేంద్ర ప్రభుత్వం లో అంతా వన్ మ్యాన్ ఆర్మీ షో నడుస్తోంది. అంతా నమో మంత్రే.

నిజంగా రెండు సీట్లు ఉన్న బీజేపీని ఈ స్థాయికి తీసుకువచ్చింది ఎవరు. ఒక్క మోదీని చూసే జనం ఓట్లేశారా…దీనికి ముమ్మాటి కాదు..కాదు…అనే అన్సార్ బీజేపీ కార్యకర్తల నుంచే వస్తోంది. సోమనాథ్ యాత్ర నుంచి మొన్నటి ప్రభుత్వం ఏర్పడే వరకు అద్వానీ అండ్ కో కష్టం ఉంది. ఇది కాదనిలేని సత్యం. మరి ఇలాంటివాళ్లని ఇబ్బంది పెడుతున్నదెవరు.ఇన్నాళ్లూ మరుగున పడిన బాబ్రీ కేసు తేనెతుట్టేను కదిపిందెవరు..ఎందుకిలా చేస్తున్నారు..?