ప్చ్‌..నమ్మినోడే మేకయ్యాడు! - MicTv.in - Telugu News
mictv telugu

ప్చ్‌..నమ్మినోడే మేకయ్యాడు!

June 20, 2017

ఆ జెండా రెపరెపలాడుతుంటే ఆయన కృషే..ఆ జెండా అధికారంలో ఉందంటే ఆయన శ్రమే.కష్టాల కడలిలో అధికార వనానికి వచ్చిదంటే మహారథి పుణ్యమే. మరి అలాంటి ఆడ్వాణీ పార్టీ కోసం జీవితం ధారపోసినా పదవి దక్కలేదు..కాదు కాదు దక్కనీయలేదు..నమ్మనోడే మేకయ్యాడా…?రాష్ట్రపతిని చేసి రుణం తీర్చుకుంటానన్న ఎన్నికల హామీ ఏమైంది..? కాంగ్రెస్ కల్చర్ కు నమో మంత్రానికి పెద్దగా తేడా లేదా..?
ఒకప్పుడు అడ్వాణీ మాటే శాసనం. ఆయన వేలెత్తిచూపిన దారిలో నేతలు, కార్యకర్తలు నడిచారు. రెండు ఎంపీ సీట్లున్న పార్టీని పార్లమెంట్ దాకా నడిపించారు. పిడికిళ్లు బిగిస్తూ ఆవేశంగా మాట్లాడిన మాటలు నడమంతరపు నమోమంత్రం ముందు తలవంచాయి.ఫలితంగా నమో విసిరిన గూగ్లీకి పెద్దాయన డకౌట్.

పార్టీ కోసం ఆడ్వాణీ జీవితాన్ని ధారపోశాడు. ప్రధాని పదవినీ త్యాగం చేశారు. సెక్యులరిస్ట్ గా కనిపించేందుకు ట్రై చేశారు. అయినా.. అనుకున్నదేదీ జరగలేదు. నాడు రథయాత్రలో ఆడ్వాణీ పక్కన ఉండి సేవలు చేసిన వ్యక్తి.. ఆయన కనుసన్నల్లో పనులు చక్కబెట్టిన మనిషి.. ఆయన మాటతో ముఖ్యమంత్రి అయినవ్యక్తి.. కష్టకాలంలో ఆ పెద్దాయన ఎవరికి అండగా నిలిచారో.. ఆ వ్యక్తే ఇప్పడు మేకయ్యాడు.
ఆడ్వాణీని రాష్ట్రపతి చేసి ఆయన రుణం తీర్చుకుంటానన్న ప్రధాని మోదీ మాటలు గంగలో కలిసిపోయాయి. మాట చెల్లని కాలంలో మామూలుగా అన్నమాటే అవకాశంగా తీసుకున్నారు శిష్యుడు. రాష్ర్టపతి రేసులో లేనన్న గురువుకు హ్యాండిచ్చారు.ఆహా కాంగ్రెస్ తరహా కమల్నాటకమంటే ఇదే..
బీజేపీలో ఇప్పుడు అంతా మోదీ మార్క్. గురువైనా,ప్రత్యర్థియినా డోంట్ కేర్. అడ్డుననిపిస్తే అంతే..ఏదో విధంగా ఇబ్బందులు పెట్టడం నమో నయా మంత్రం. ఒకప్పుడు కాంగ్రెస్ లో ఈ కల్చర్ ఉండేది. ఇప్పుడు బీజేపీకి ఇది పాకింది. జెండా మోసినోడికే పదవులని చెప్పుకునే పార్టీ పెద్దాయనకు తీరని అన్యాయం చేయడం సగటు బీజేపీ కార్యకర్తల్ని కలవరపరుస్తోంది.