లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కారం...కేంద్రమంత్రి - MicTv.in - Telugu News
mictv telugu

లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కారం…కేంద్రమంత్రి

May 29, 2020

lock down.

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి లాక్ డౌన్ ఒక్కటే మార్గమని కేంద్రమంత్రి రవి శంకర్ ప్రసాద్ అన్నారు.  దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలు అందర్ని సంప్రదించిన తర్వాతే అమలులోకి తెచ్చామని తెలిపారు. ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

కరోనా వైరస్‌కు ప్రస్తుతానికి మందు లేదని, లాక్‌డౌన్, ప్రార్థనలు ఒక్కటే మందులన్ని తెలిపారు. నిర్ణీత సమయంలో లాక్‌డౌన్‌ను విధించడంతోనే కరోనా మరణాలపై అదుపు సాధించామన్నారు. ఇలాంటి విపత్కర సమయాల్లో డిజిటల్ ఇండియా అన్న ఐడియా దేశాన్ని బలోపేతం చేస్తోందని, అలాగే దేశాన్ని అత్యంత నిజాయితీతో నడిపిస్తున్నామని ప్రకటించారు. ‘అత్యంత నిజాయితీతో ఉన్న ప్రజలతో దేశాన్ని నడుపుతున్నాం. ప్రభుత్వాన్ని ఎవరూ వెలెత్తి చూపకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతున్నాం. కరోనాతో పోరాడటానికి తగిన చర్యలు తీసుకున్నాం. సకారాత్మక విమర్శపై తమకు పూర్తి నమ్మకం ఉంది’ ఆయన అన్నారు.