తెలంగాణ లాక్ డౌన్ కాలాన్ని మే 31 పెంచుతున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కంటైన్మెంట్ ఏరియాలు మినహా.. మిగతావన్నీ గ్రీన్‌జోన్లేనని సీఎం కేసీఆర్ తెలిపారు. మంత్రివర్గ సమావేశం తరువాత సీఎం కేసీఆర్ మీడియా మాట్లాడారు. ప్రస్తుతం 1450 కుటుంబాలు మాత్రమే కంటైన్మెంట్ పరిధిలో ఉన్నాయన్నారు. హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాల్లో అన్ని షాపులూ తెరచుకోవచ్చని తెలిపారు.
Watch Live: Honourable CM Sri KCR addressing the media after state cabinet meeting. #Coronavirus #IndiaFightsCorona https://t.co/Hk5k7iizr8
— Telangana CMO (@TelanganaCMO) May 18, 2020
సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ..’రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు రోడెక్కుతాయి. సిటీ బస్సులు, అంతర్రాష్ట్ర బస్సులకు మాత్రం అనుమతి లేదు. హైదరాబాద్‌లో ఆటోలు, క్యాబ్‌లు నడుపుకోవచ్చు. కానీ, డ్రైవర్‌తో పాటు ముగ్గురు మాత్రమే ప్రయాణించాలి. మెట్రో రైళ్లు ఇప్పుడే ఓపెన్ కావు. కంటైన్మెంట్ జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో సెలూన్ షాపులు ఓపెన్ చేయవచ్చు. ఈ-కామర్స్ సంస్థలు తమ కార్యకలాపాలు జరపుకోవచ్చు. విద్యా సంస్థలు, ఫంక్షన్ హాల్స్, థియేటర్లు, బార్లు, పార్క్‌లు, జిమ్, అమ్యూజ్‌మెంట్ పార్క్, మత ప్రార్థనలు, ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదు. రాత్రివేళల్లో కర్ఫ్యూ యథాతధంగా కొనసాగుతుంది. బయట తిరిగేవారు మాస్క్ ధరించడం తప్పనిసరి.’ అని తెలిపారు.