నూజివీడులో జూన్ 8 వరకు లాక్‌డౌన్ - MicTv.in - Telugu News
mictv telugu

నూజివీడులో జూన్ 8 వరకు లాక్‌డౌన్

May 12, 2020

Jiyaguda corona covid cases Hyder

కృష్ణాజిల్లా నూజివీడులో కరోనా కలకలం సృష్టించింది. దీంతో లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. వచ్చే నెల 8వ తేదీ వరకు ఇది అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. మైలవరం రోడ్డుకు చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వెంటనే ఆ మహిళ నివాసం ప్రాంతంలో శానిటైజేషన్ చేశారు.

దీంతో నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని వెల్లడించారు. రెడ్ జోన్‌లో కార్యకలాపాలపై ఆంక్షలు విధించారు. మిగతా అన్ని ప్రాంతాల్లో ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు మాత్రమే కూరగాయలు, నిత్యావసర దుకాణాలు తెరవాలని  సూచించారు. ఇటీవల కృష్ణ లంకలోనూ ఓ వ్యక్తికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. వరుసగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.