లాక్‌డౌన్ ఎఫెక్ట్.. గ్యాస్ సిలిండర్లు దొరక్క జనం ఇబ్బందులు  - MicTv.in - Telugu News
mictv telugu

లాక్‌డౌన్ ఎఫెక్ట్.. గ్యాస్ సిలిండర్లు దొరక్క జనం ఇబ్బందులు 

March 26, 2020

Lockdown Gas Cylinder LPG Cylinder Shortage  

కరోనా ప్రభావంతో దేశమంతా లాక్‌డౌన్ అయింది. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, నిత్యావసరాలు మినహా ఎటువంటి వాటికి అనుమతించేది లేదని ప్రభుత్వాలు ప్రకటించాయి. కూరగాయాలు, పండ్లు, బియ్యం, ఎల్పీజీ,పెట్రోల్ పంపులు, ఆస్పత్రులు, మీడియాకు మినహాయింపు ఇచ్చారు. నిత్యావసరాల విషయంలో మాత్రం ప్రభుత్వాలు చెబుతున్నదానికి చర్యలకు పొంతన లేకుండా పోయింది. ఉన్నట్టుండి గ్యాస్ సిలిండర్లు అయిపోయిన వారికి చుక్కలు కనబడుతున్నాయి. సమయానికి గ్యాస్ దొరక్క, వంట చేసుకునే అవకాశ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

దేశవ్యాప్తంగా ఎల్పీజీ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉంచడంలో మాత్రం అధికారులు విఫలమయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. గ్యాస్ సిలిండర్ల కోసం గంటల తరబడిన క్యూ లైన్లలో నిలబడి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా కూడా సిలిండర్ల కోసం ఇబ్బంది పడాల్సి వస్తుందని చెబుతున్నారు. హైదరాబాద్ టోలి చౌకీలో ఉన్న ఓ గ్యాస్ సెంటర్ వద్ద కూడా ఇలాగే భారీ క్యూ కనిపించింది. చాలా మంది ప్రజలు ఖాళీ గ్యాస్ సిలిండర్లతో గంటల పాటు ఎదురు చూస్తున్నారు. నిర్వాహకులను గ్యాస్ కోసం కోరినా రేపు ఇస్తామంటూ నిర్లక్షంగా సమాధానం చెబుతున్నారని వాపోతున్నారు. అత్యవసర పరిస్థితిలో ఇంట్లో వంట చేసుకోవడానికి కూడా ఇబ్బందిగా మారిందని వెంటనే అధికారులు స్పందించి కొరతను తీర్చాలని కోరుతున్నారు.