Lockdown In China Wuhan
mictv telugu

అక్కడ మళ్లీ లాక్‌డౌన్..ఒక్క కేసు వచ్చినా ఎందుకీ కలవరం..?

October 26, 2022

Lockdown In China Wuhan

కరోనా పుట్టిల్లు వుహాన్‌లో మళ్లీ లాక్‌డౌన్ విధించారు. పలు ప్రాంతాల్లో పాక్షిక లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. కేసులు ఎక్కువగా వున్న హన్ యాంగ్‌లో సూపర్ మార్కెట్లు, ఫార్మసీలు మాత్రమే తెరిచేందుకు అనుమతి ఇచ్చారు.

ప్రపంచమంతా కోలుకున్నా…

కరోనాను ఇప్పుడు ప్రపంచం లైట్ తీసుకుంది.చాలా దేశాల్లో ఆంక్షలు ఎత్తేశారు. వైరస్ బలహీన పడిందని, భయపడాల్సిన పరిస్థితుల్లేవని ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. మాస్క్‌లు ధరించాల్సిన అవసరం లేదని ప్రకటించాయి.కరోనా పుట్టిల్లు చైనా మాత్రం ఒక్క కేసు వచ్చినా ఉలిక్కి పడుతోంది. జీరో కొవిడ్ విధానాన్ని అమలు చేస్తుంది. ప్రపంచమంతా జిన్ పింగ్ తీరుని తప్పుపడుతున్నా చైనా పట్టించుకోవట్లేదు.

వుహాన్‌లో మళ్లీ లాక్‌డౌన్

వుహాన్ లోని హన్‌యాంగ్‌లో కరోనా కోరలు చాచింది. కేసులు ఒక్కసారిగా పెరిగాయి. 24 గంటల్లో 18 కేసులు నమాదయ్యాయి. ఇంకేముంది చైనా ప్రభుత్వం అక్కడ లాక్‌డౌన్ విధించింది. మనదగ్గరే కాదు ప్రపంచంలో ఎక్కడైనా ఇన్ని కేసులు ప్రస్తుతం మామూలు విషయం.కానీ చైనా కరోనాను ఇంకా భూతంలా చూస్తుంది.

చైనాలో ఎందుకీ ఉలిక్కిపాటు

9లక్షల జనాభా వున్న వుహాన్‌ ప్రపంచంలోనే తొలుత లాక్ డౌన్‌లోకి వెళ్లింది.2020 ఏప్రిల్‌లో కరోనాను నిర్మూలించిన తొలినగరంగా పేరుతెచ్చుకుంది. ఇప్పుడు మళ్లీ భయం గుప్పిట్లో వెళ్లింది. కాదు కాదు కేవలం 18 కేసులకే జనాన్ని భయపెడుతోంది చైనా.ఇలా వుహాన్ తో పాటు పలు ప్రాంతాల్లో ఇంకా ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచమంతా వైరస్‌ని కట్టడి చేస్తూ..కరోనాతో కలిసి జీవిస్తోంది.ప్రపంచమంతా మారినా జీరో కొవిడ్ వ్యూహాన్ని డ్రాగన్ కంట్రీ అమలు చేస్తుంది. చైనా తీరుని చూసి కొన్ని దేశాలు నవ్వుకుంటున్నాయి. డబుల్ డిజిట్ కేసులకే అనవసరంగా జనాల్ని భయపెడుతుందని అంటున్నాయి.