లాక్‌డౌన్‌లో నేరాలు పెరుగుతున్నాయి. ఇన్ని రోజులు ఉద్యోగాలు, వ్యాపారాలు అంటూ బయట తిరిగిన పురుష పుంగవులు ఇప్పుడు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇంట్లో ఉండి మరింత సుఖానికి మరిగారు. ఆర్డర్లు వేస్తూ అవీ ఇవీ కావాలని భార్యలను ఇంకా ఎక్కువ పని కల్పిస్తున్నారు. దీంతో విసుగెత్తుతున్న భార్యలపై చేయి చేసుకుంటున్నారు. దీంతో గృహహింస కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కారణం ఏంటో గానీ ఓ మహిళ తన భర్తను చంపి నదిలో పూడ్చి పెట్టింది. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం మంధర్నా గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది.
ఓ మహిళ తన భర్తను చంపి మంజీర నదిలో పాతిపెట్టింది. లాక్‌డౌన్ కదా ఎవరూ గుర్తించరని భవించినట్టుంది. కానీ, రెండు రోజుల్లోనే పోలీసులు ఈ దారుణాన్ని పసిగట్టారు. ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన గురించి తెలిసి గ్రామస్థులు షాకయ్యారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.