ఇళ్ల నుంచి బయటికి రాకుండా తాళాలు..  - MicTv.in - Telugu News
mictv telugu

ఇళ్ల నుంచి బయటికి రాకుండా తాళాలు.. 

April 4, 2020

Locks for Homes in Lepakshi  

దేశంలోని చాలా ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఉల్లంఘనలు యధేచ్చగా కొనసాగుతున్నాయి. ఏదో ఒక  సాకుతో కొంత మంది ప్రజలు బయటకు వస్తూనే ఉన్నారు. ప్రాణాంతక వ్యాధి ప్రభలుతుందనే భయం కూడా లేకుండాపోయింది. దీంతో ఇలాంటి వారిని కట్టడి చేసేందుకు అనంతపురం జిల్లా లేపాక్షి అధికారులు వినూత్న పద్దతి చేపట్టారు. ఇళ్లకు బయటి నుంచి తాళాలు  వేస్తూ ఎవరూ గడపదాటి బయటకు రాకూడదని సూచిస్తున్నారు.

ఇటీవల హజ్‌కు వెళ్లి వచ్చిన ఓ పదేళ్ల బాలుడికి వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. వెంటనే అధికారులు స్థానికులను అప్రమత్తం చేశారు. ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదని సూచించారు. అయినా కొంత మంది వీటిని లెక్క చేయలేదు. ఎన్నిసార్లు చెప్పినా ప్రజలు వినిపించుకోవడం లేదని తెలిసి అధికారులు రూటు మార్చారు. ఏకంగా ఎమ్మార్వో బలరాం రంగంలోకి దిగి ఇళ్లకు తాళాలు వేశారు. జనాలు ఎవరూ బయటకు రాకూడదని హెచ్చరించారు. తాగునీరు, పాలు, ఇతర నిత్యావసరాలు అవసరమైనవారికి ఇంటి వద్దకే సరఫరా చేస్తామన్నారు. కాదని ఎవరైన నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.  వైరస్ వ్యాప్తి ఉందని చెప్పినా వినకపోవడంతోనే ఇలా తాళాలు వేయాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు.\