ఖాకీ రాక్షసులకు జీవిత ఖైదు! - MicTv.in - Telugu News
mictv telugu

ఖాకీ రాక్షసులకు జీవిత ఖైదు!

November 1, 2017

లాకప్ డెత్, లాకప్ రేప్, చిత్రవధ, థర్డ్ డిగ్రీ.. వంటి మాటల్లో చెప్పలేని ఘోరాలకు పాల్పడే పోలీసుల నేరాలకు త్వరలోనే తెరపడనుంది. ఇలాంటి ఘోరాలకు పాల్పడే ఖాకీలకు యావజ్జీవ జైలు శిక్ష విధించాలని లా కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

దీనికి సంబంధించి ఓ బిల్లును, నివేదికను సర్కారుకు సమర్పించింది. లాకప్ హింసపై ఆరోపణలు వస్తే జవాబు చెప్పాల్సిన బాధ్యత పూర్తిగా పోలీసులపైనే పెట్టాలని కమిషన్ పేర్కొంది. చిత్రహింసలు, అమానవీయ చర్యలకు పాల్పడేవారికి కఠినంగా శిక్షించడానికి ఉద్దేశించిన ఐక్యరాజ్య సమితి ఒప్పందానికి భారత్ కూడా ఆమోదం తెలపాలని సూచించింది. మన దేశంలో 2011 -2015 మధ్య కాలంలో పోలీసు కస్డడీలో చిత్రహింస వల్ల 15,300 మంది చనిపోయారు. మరో 16 వేల మంది తీవ్ర గాయాలకు గురయ్యారు. అయితే లాకప్ మరణాలపై విచారణ జరడం లేదు. కేవలం 50 శాతం మరణాలే నమోదవుతున్నాయి. పోలీసులు తిమ్మిని బమ్మిని చేస్తుండడంతో బాధితులకు న్యాయం జరగడం లేదు.