సెహ్వాగ్ ఇంటిని చుట్టుముట్టిన మిడతలు  - MicTv.in - Telugu News
mictv telugu

సెహ్వాగ్ ఇంటిని చుట్టుముట్టిన మిడతలు 

June 28, 2020

Sehwag

ఢిల్లీని మిడతల దండు మెల్లగా చుట్టుముడుతోంది. వీటి సెగ మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు కూడా తగిలింది. ఆయన ఇంటిని ఈ దండు చుట్టుముట్టింది. గురుగ్రామ్‌లో ఇది జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను ఆయన తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇంటికి కిటికీలు, తలుపులు మూసేసి ఇంటికే పరిమితమైనట్టు వెల్లడించారు. మిడతలు అక్కడ వాలకుండా చుట్టుపక్కల వారంతా శబ్ధాలు చేస్తూ కనిపించారు. 

మిడతల దండు వస్తుండటంతో ముందుగానే స్థానిక ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.కిటికీలు, తలుపులు మూసేసుకోవాలని చెప్పారు. భారీ ఎత్తున వచ్చిన ఈ దండు చూసి స్థానికులు కొంత ఆందోళనకు గురయ్యారు. అవి వేగంగా వెళ్తుంటే వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.