పాక్ మంత్రి నోటిదూల.. మిడతల బిర్యానీ చేసుకోండి.  - MicTv.in - Telugu News
mictv telugu

పాక్ మంత్రి నోటిదూల.. మిడతల బిర్యానీ చేసుకోండి. 

November 14, 2019

తెలుగు రాష్ర్ట్రాల్లో దోమల వీరంగం వల్ల డెంగీ వ్యాధులు సోకుతున్నాయి. దోమల నిర్మూలనకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. మనం దోమలతో బాధపడుతున్నట్లే పాకిస్తాన్‌లోని కరాచీ నగర ప్రజలు రెండు రోజులుగా మిడతలతో ఇక్కట్లు పడుతున్నారు. ఆకాశం నుంచి కురుస్తున్నాయా అన్నట్లు కుప్పలకొద్దీ వచ్చి పడుతున్న ఈ పురుగులకు భయపడి ఇళ్ల నుంచి బయటికి రావడం లేదు. అవి అఫ్ఘానిస్తాన్ నుంచి వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చినా వాటి నుంచి తమను కాపాడాలని జనం కోరుతున్నారు. మిడతల దాడి వీడియోలను ప్రభుత్వానికి పంపుతూ రక్షించండని వేడుకుంటున్నారు.  

ఈ సమస్యపై పాక్ లోని సింధ్ రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి ఇస్మెయిల్ రాహు వెటకారంగా స్పదించాడు. ప్రభుత్వం మిడతల నివారణకు చర్యలు తీసుకుంటోందని అంటూనే.. ‘మిడతలు అన్నివైపులు నుంచి వస్తున్నాయిగా. మరీ ఇబ్బిందిగా ఉంటే.. వాటితో బిర్యానీ చేసుకుని తినండి..అవి మంచివే.. పంటలను నాశనం చెయ్యడం లేదు. మనుషులకు కూడా హానికరం కాదు’ అని అన్నాడు. ఆయన సరదాగానో, కోపంగానో అన్నా జనం మాత్రం భగ్గుమంటున్నారు. ప్రజా సమస్యలపై ఇలాగేనా స్పందించేదంటూ సోషల్ మీడియాలో ఏకేస్తున్నారు. ‘మేం సరే, ముందు నువ్వు తిని చూపించు…’ అని దాడి చేస్తున్నారు.