తనపై సోషల్ మీడియాలో వేధింపులు ఎక్కువ అయ్యాయి అంటూ ఇటీవల సంచలనం సృష్టించిన తమిళ నటి విజయ లక్ష్మీ వ్యవహారంలో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఆమెపై చెన్నైలోని ఓ లాడ్జి ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు రావాల్సిన రూ.3 లక్షల అద్దెను చెల్లించడం లేదని పేర్కొన్నాడు. వెంటనే చర్యలు తీసుకొని డబ్బు వచ్చేలా చేయాలని కోరాడు. అతడి ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు.
నాలుగు నెలలుగా సీమాన్, హరినడర్ అనే ఇద్దరు రాజకీయ నేతలు చేస్తున్న పనుల కారణంగా తాను ఒత్తిడికి గురవుతున్నానని సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. వేధింపులు ఎక్కువయ్యాని ఏడుసతూ.. ఆ లాడ్జ్ లోనే ఆమె ఆత్మహత్య యత్నం కూడా చేసింది. ఆ తర్వాత ఆమె కోలుకున్నా కూడా డబ్బులు ఇవ్వడం లేదని అతడు ఆరోపించాడు. నెలల తరబడి తన లాడ్జిలో ఉండి అద్దె చెల్లించలేదని చెప్పాడు. దీంతో ఈ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై ఆమె ఏ విధంగా స్పందిస్తుందనేది తేలాల్సి ఉంది.