Logan Smith told when King Charles will die
mictv telugu

కింగ్ చార్లెస్ మరణం ఆరోజే.. ఆందోళనలో బ్రిటన్ ప్రజలు

September 13, 2022

బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ 2 సెప్టెంబర్ 8న మరణించిన విషయం తెలిసిందే. దీంతో తదుపరి రాజుగా ఆమె కుమారుడు కింగ్ చార్లెస్ 3 బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి గతంలో చేసిన ట్వీట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. క్వీన్ ఎలిజబెత్ ఫలానా రోజున చనిపోతుందని ఓ వ్యక్తి ఇంతకు ముందే ఊహించాడు. లోగన్ స్మిత్ అనే పేరుతో ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. బ్రిటన్‌కు అత్యధిక కాలం మహారాణిగా ఉన్నవారు సెప్టెంబర్ 8, 2022 న మరణిస్తారని ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ ట్వీట్ రాణి మరణించిన రోజు వైరల్ అయింది. దీనిని వేల మంది రీట్వీట్ చేశారు. అయితే అదే ట్వీట్‌లో రాజు చార్లెస్ 3 ఎప్పుడు చనిపోతారో తేదీతో సహా చెప్పడం బ్రిటన్ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. కింగ్ చార్లెస్ మార్చి 28, 2026న చనిపోతారని అందులో ఉంది. ఇది వైరల్ అవడంతో లోగన్ స్మిత్ తన ఖాతాను ప్రైవేటుగా మార్చుకున్నాడు. దీంతో సాధారణ యూజర్లకి అతని పాత ట్వీట్లు కనిపించడం లేదు. కానీ, అప్పటికే ఆ ట్వీట్లను స్క్రీన్ షాట్ తీసిన వారు మళ్లీ షేర్ చేస్తుండడంతో లోగన్ స్మిత్ ప్రెడిక్షన్ చూసి షాకవుతున్నారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇలా అంచనా వేయడం కరెక్ట్ కాదు. ఎవరు ఎప్పుడు చావాలో భగవంతుడు నిర్ణయిస్తాడని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. మరి లోగన్ స్మిత్ అంచనా మరోసారి నిజమవుతుందా? అని బ్రిటన్ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.