రాజకీయాల్లోకి 'మద్దాలి శివారెడ్డి'.. ఎంపీగా పోటీ - MicTv.in - Telugu News
mictv telugu

రాజకీయాల్లోకి ‘మద్దాలి శివారెడ్డి’.. ఎంపీగా పోటీ

April 16, 2019

కొంత కాలం క్రితం తెలుగులో వచ్చిన ‘రేసుగుర్రం’ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించగా భోజ్ పూరి హీరో రవికిషన్ విలన్‌గా నటించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. మద్దాలి శివారెడ్డి పాత్రతో ప్రేక్షకులను విశేషంగా అలరించిన రవికిషన్ ఆపై అనేక చిత్రాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు. ఇప్పుడీ నటుడు రాజకీయాల్లో ప్రవేశించి ఎంపీగా పోటీచేస్తున్నాడు. రవికిషన్‌కు బీజేపీ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్ పూర్ నియోజకవర్గం సీటును కేటాయించింది.

Lok Sabha Election Ravi Kishan, Bhojpuri Star, Is BJP's Hero For Gorakhpur Prestige Clash.

బీజేపీ అధినాయకత్వం సోమవారం ఏడుగురు యూపీ అభ్యర్థులను ప్రకటించగా అందులో రవికిషన్ పేరు కూడా ఉంది. రవి కిషన్ పోటీచేస్తున్న గోరఖ్ పూర్ నియోజకవర్గం బీజేపీకి కంచుకోట అని చెప్పాలి. ప్రస్తుతం యూపీ సీఎంగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ గతంలో ఇక్కడినుంచి ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.