సంచుల్లో పట్టుబడ్డ డబ్బులు.. ఎన్నికలు రద్దు.. - MicTv.in - Telugu News
mictv telugu

సంచుల్లో పట్టుబడ్డ డబ్బులు.. ఎన్నికలు రద్దు..

April 16, 2019

ఎన్నికల ప్రచారం ముగిసింది. మరో రెండు రోజుల్లో పోలింగ్ తేదీ. కానీ అసలు ఎన్నికలు జరుగుతాయో లేదోనని అందరిలో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే అక్కడ సంచులకొద్ది డబ్బులు పట్టుబడింది. దీంతో ఎన్నికల సంఘం ఇక్కడ ఎలాగైన ఎన్నికలు రద్దు చేయాలని భావిస్తోంది. దీంతో అందరి చూపు తమిళనాడులోని వెల్లోర్ లోక్‌సభ స్థానం. తాజాగా ఈ నియోజకవర్గంలోని డీఎంకే అభ్యర్థికి చెందిన సిమెంట్ గోడౌన్‌లో ఉన్న రూ.12 కోట్లను ఐటీ అధికారులు సీజ్ చేశారు.

Lok Sabha Elections 2019 Polls May Be Cancelled For Tamil Nadu Seat After Cash Haul At DMK Office.

డబ్బు ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఇక్కడ లోక్ సభ ఎన్నికలను రద్దు చేయాలని ఆలోచిస్తుంది. ఈ విషయాన్ని రాష్ట్రపతికి కూడా చేరవేసింది. కాగా రాష్ట్రపతి నిర్వణయ మీదే వెల్లోర్ లో ఎన్నికలు జరుగుతాయో లేదో తెలుస్తోంది. కాగా రెండో విడతలో భాగంగా ఈ నెల 18వ తేదీన వెల్లోర్‌లో పోలీంగ్ జరగాల్సి ఉంది.