లోక్ సభ మాజీ స్పీకర్ కన్నుమూత..

లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీ(89) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతిచెందారు. కిడ్నీ సంబంధిత వ్యాధులతో కోల్ కతాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రోజురోజుకు చటర్జీ ఆరోగ్యం క్షిణిస్తూ.. ఆదివారం గుండెపోటు వచ్చింది. దీంతో వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయినా ఫలితం దక్కలేదు.. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.lok sabha Ex speaker paases away లోక్‌సభ సభ్యుడిగా పదిసార్లు పనిచేసిన చటర్జీ.. 1968లో సీపీఎంలో చేరి 2008 వరకు పార్టీలో ఉన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2004 నుంచి 2009 వరకు లోక్‌సభ స్పీకర్‌గా పేవలందించారు. అయితే యూపీఏ-1 ప్రభుత్వానికి సీపీఎం మద్దతు ఉపసంహరించుకుంది.. అయినా చటర్జీ స్పీకర్‌ పదవికి రాజీనామా చేయలేదు.. దీంతో పార్టీ నుంచి బహిష్కరించింది.