గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న స్పీకర్ ఓం బిర్లా - MicTv.in - Telugu News
mictv telugu

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న స్పీకర్ ఓం బిర్లా

September 17, 2020

greenn

టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ఎంతగానో సక్సెస్ అవుతోంది. దేశవ్యాప్తంగా సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఎందరో ఈ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటారు. సామాన్యుల సైతం పెద్ద ఎత్తున ఈ ఛాలెంజ్ లో పాల్గొంటున్నారు. మొక్కలు నాటుతూ ఫోటోలు దిగుతున్నారు. 

ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ స్నేహితులు ఈ ఛాలెంజ్ ను స్వీకరించేలా ప్రోత్సహిస్తున్నారు. తాజాగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా పాల్గొన్నారు. ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజుని పురస్కరించుకుని ఓం బిర్లా పార్లమెంట్‌ ఆవరణలో రుద్రాక్ష మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు సంతోష్‌కుమార్‌, కే.కేశవరావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోను ఎంపీ సంతోష్ కుమార్ ట్విట్టర్ లో షేర్ చేశారు.