'లెజెండ్' డైలాగుతో జగన్‌పై విరుచుకుపడ్డ లోకేశ్.. - MicTv.in - Telugu News
mictv telugu

‘లెజెండ్’ డైలాగుతో జగన్‌పై విరుచుకుపడ్డ లోకేశ్..

July 3, 2022

ఆంధ్రప్రదేశ్‌లో గతకొన్ని నెలలుగా వైసీపీ, టీడీపీల మధ్య ట్విటర్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆదివారం టీటీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. అంతేకాదు నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘లెజెండ్’ సినిమాలోని డైలాగుతో జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. లోకేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాఫిక్‌గా మారాయి.

ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వ‌లంటీర్ల‌ విషయంలో అందిస్తున్న సౌక‌ర్యాల‌పై ఆయన వ‌రుసగా ట్విట్ల‌ు చేశారు. ఆ పోస్టుల్లో.. ”సాక్షి ప‌త్రిక వేయించుకునేందుకు వలంటీర్ల‌కు జ‌గ‌న్ స‌ర్కారు నిధులు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పాలన మా ఇంటికి వ‌స్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వ‌స్తే ఏమి ఇస్తారు అన్న చందంగా జ‌గ‌న్ వ్య‌వ‌హారం ఉంటోంది. వలంటీర్లు సాక్షి ప‌త్రిక‌ను చ‌దివేందుకే జ‌గ‌న్ స‌ర్కారు ఏడాదికి 63.84 కోట్లు ఖ‌ర్చు చేస్తోంది. ఇదంతా జనం సొమ్మే. జనం సొమ్ము జలగలా పీల్చేస్తున్న ”జగన్ జనానికి ఎదురెళ్లినా జనమే ఆయ‌న‌కు ఎదురొచ్చినా జనానికే రిస్కు” అంటూ లోకేశ్ ట్విట్ చేశారు.

అనంతరం ఖజానాలో డబ్బులు లేవని ప్రజాసంక్షేమ పథకాలు ఆపేసిన ప్రభుత్వం రూ.300 కోట్లతో సాక్షి ప‌త్రిక‌కు ప్రకటనలు ఇచ్చిందని లోకేశ్ ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు సంక్షేమ కార్యక్రమాల గురించి తెలుసుకోవాలంటే సాక్షి ప‌త్రిక‌ను వేయించుకోవాలని ఆదేశించారని ఆయన అన్నారు. అందుకోసం నెలకు రూ.5.32 కోట్లు విడుద‌ల చేస్తున్న‌ట్లు ఉత్త‌ర్వులు ఇచ్చార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు, యువత కళ్లు తెరవాలని కోరారు.