చినబాబు ...అంతకుమించి... - MicTv.in - Telugu News
mictv telugu

చినబాబు …అంతకుమించి…

May 29, 2017

ఎవరైనా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవాలనుకుంటారు. అందుకు తగ్గుట్టు ఫాలో అవుతూ ముందుకు వెళ్తుంటారు..చినబాబు మాత్రం అంతకుమించి అనిపించుకోవాలనుకుంటున్నాడు.మంత్రి అయ్యాక మరీను…ఎందుకిలా అంటే…చినబాబు లోకేష్ ..ఏదో చేయాలనుకుంటారు..ఎంతో చేయాలనుకుంటాడు..బాబు కంటే బాగా మాట్లాడాలని అనుకుంటారు..బట్ మైక్ చేతిలోకి వచ్చేసారికి కొంచెం తడబాట.. అనుకున్నది ఒక్కటైతే, అయ్యేదొకటవుతుంది. పాపం చినబాబు..
ఈ యువ మంత్రి..ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తో పోటీపడలేకపోతున్నారట,వేగంలో అందుకోలేకపోతున్నారట. ఇవేవో తెలుగుతమ్ముళ్లు చెప్పిన మాటలు కావు.స్వయనా లోకేష్ బాబే చెప్పారు. ఎక్కడంటే విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్‌ కళాశాలలో జరుగుతున్న మహానాడులో.సీఎం చంద్రబాబు నాయుడు వేగంతో యువకుడినైన తానే పోటీ పడలేకపోతున్నాని అని అన్నారు. నిజమే..మరి చంద్రబాబు ఎక్కడ… చినబాబు లోకేష్ ఎక్కడ. బాబు వేగాన్ని అందుకోవాలంటే తెలుగుతమ్ముళ్లలో ఎవరి వల్ల కాదు. సెంట్ పర్సెంట్. చినబాబు అత్యాశ కాబోతే…