లోక్‌పాల్ వెబ్‌సైట్ ప్రారంభం - MicTv.in - Telugu News
mictv telugu

లోక్‌పాల్ వెబ్‌సైట్ ప్రారంభం

May 17, 2019

అన్న హజారే వంటి ఎందరో సామాజికవేత్తలు పోరాటం ఫలితంగా లోక్ పాల్ చట్టం ఏర్పడిన సంగతి తెలిసింది. 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం లోక్‌పాల్‌-లోకాయుక్త చట్టాన్ని తీసుకువచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు, సంస్థలు అక్రమాలకు పాల్పడితే లోక్‌పాల్‌, లోకాయుక్త పరిధిలో విచారణ జరుగుతుంది.

Lokpal Website inaugurated by first lokpal justice pinaki chandra ghosh  .

ఈ లోక్‌పాల్‌కు కార్యరూపం తీసుకొచ్చేందుకు మోదీ ప్రభుత్వం 2019 మార్చి 19న మొదటి లోక్‌పాల్‌ను ఏర్పాటు చేసి జస్టిస్‌ చంద్ర ఘోష్‌ను ఛైర్మన్‌గా నియమించింది. కాగా, లోక్‌పాల్‌కు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ గురువారం ప్రారంభమైంది. లోక్‌పాల్ మొదటి చైర్మెన్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ దీన్ని ప్రారంభించినట్లు ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఈ వెబ్‌సైట్‌లో లోక్‌పాల్‌ విధానాలను, పనితీరును పొందుపరచినట్లు తెలిపారు. http://lokpal.gov.in యూఆర్‌ఎల్‌లో ఈ వెబ్‌సైట్‌ను వీక్షించవచ్చు.