గో రక్షక్ పేరిట దాడులకు దిగితే తాట తీస్తామన్న ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినా…దాడులు మాత్రం ఆగడం లేదు. దేశంలో ఎక్కడో చోట అరాచక శక్తులు దాడులు చేస్తూనే ఉన్నాయి. ఇటీవల ఓ బాలుడ్ని సైతం చావగొట్టారు.
ఇప్పడు ఇదే అంశం లోక్ సభని కుదిపేసింది. చర్చకు పట్టుబట్టిన విపక్ష ఎంపీలు వెల్ లోకి దూసుకెళ్లారు. ఈ సమయంలో ఎంపీ కొడికున్నిల్ సునిల్ స్పీకర్ చైర్ వైపు పేపర్లు విసిరేశారు. దీంతో సభలో మరింత గందరగోళం నెలకొంది. అయినా కానీ స్పీకర్ మాత్రం సభను వాయిదా వేయకుండా
మొదట ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని చర్చించాలని కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీలు డిమాండ్ చేశాయి. ప్రశ్నోత్తరాలను అడ్డుకునే ప్రయత్నం చేశాయి. దీంతో గందరగోళం నెలకొంది. జీరో అవర్లో ఈ అంశాన్ని చర్చిద్దామని స్పీకర్ సుమ్రితా మహాజన్ అన్నారు. దళితులు, మైనార్టీలు, మహిళలు దాడులకు గురవుతున్నారని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే ఆరోపించారు. బలహీనవర్గాల వారిని రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. గోరక్షణ పేరుతో దాడులకు దిగుతున్నవారిని అరికడుదామని ప్రధాని అంటున్నా దాడులు మాత్రం ఆగడం లేదన్నారు. ఇటీవల ఓ 15 ఏళ్ల బాలుడిని కూడా చావకొట్టారని ఎంపీ సౌగత్ రాయ్ అన్నారు. ఇంతలో కలగజేసుకున్న మంత్రి అనంత్ కుమార్ …భారతీయులు గోవులను పూజిస్తారని, గోవులను రక్షించాల్సిన బాధ్యత ఉందన్నారు. గో సంరక్షణ పేరుతో ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే, వాళ్లకు శిక్ష తప్పదన్నారు. ప్రతిపక్ష ఎంపీలు మాత్రం తమ నినాదాలు ఆపలేదు. వాళ్లంతా వెల్లోకి దూసుకెళ్లారు. స్పీకర్ చైర్ వైపు పేపర్లు విసిరారు.