రాజ్యసభకు జేపీ.. చంద్రబాబు వ్యూహమేంటి! - MicTv.in - Telugu News
mictv telugu

రాజ్యసభకు జేపీ.. చంద్రబాబు వ్యూహమేంటి!

February 22, 2018

లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ.. ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమం పేరుతో మళ్లీ రాజకీయంగా కాస్త క్రియాశీలమైన సంగతి తెలిసిందే. హోదా ఉద్యమం, నిరసనలు..  టీడీపీపై ప్రభావం చూపకుండా సీఎం చంద్రబాబు నాయుడు పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా నటుడు పవన్ కల్యాణ్ స్థాపించిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్(జేఎఫ్‌సీ)తో పాటు పలువురు హోదా నేతలను బజ్జగిస్తూ తన గుప్పిట్లో ఉంచుకోవడానికి యత్నిస్తున్నారు. పవన్ మనోడే అని వెనకేసుకొచ్చిన బాబు.. తాజాగా జేఎఫ్‌సీ సభ్యుడైన లోక్‌సత్తా నేత జయప్రకాశ్ నారాయణను టీడీపీ తరఫున రాజ్యసభకు పంపనున్నట్లు సమాచారం.త్వరలో ఏపీ అసెంబ్లీ కోటా నుంచి రాజ్యసభ ఎన్నికల్లో జేపీని టీడీపీ తన అభ్యర్థిగా ప్రకటిస్తుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కోటా నుంచి దక్కే రెండు సీట్లలో ఒకదాన్ని జేపీకి ఇస్తారని పేర్కొంటున్నాయి. జేపీ వంటి మేధావి పార్లమెంటులో ఉంటే పనులను త్వరగా, ఆశించిన విధంగా చక్కబెట్టుకోవచ్చన్నది బాబు వ్యూహం అని చెబుతున్నారు. అయితే పార్టీని ఇన్నాళ్లూ అంటిపెట్టుకుని ఉన్నవారిని కాదని, బయటివాడైన జేపీకి రాజ్యసభకు పంపితే నిరసన వస్తుందని, ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికి బాబు యత్నిస్తున్నారంటున్నారు.

జేపీ గత ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి లోక్‌సత్తా తప్పకుటుందని, అయితే సామాజిక సంస్థగా ఇకముందూ కొనసాగుతుందని అన్నారు. అయితే ఎన్జీవోలాంటి సంస్థ నేతగా ఉండడం తన స్థాయి  మేధావికి తక్కువ అని, ఎట్లాగైనా పార్లమెంటుకు వెళ్లాలని ఆయన యత్నిస్తున్నారని, అందుకే బాబుతో మంతనాలు సాగిస్తున్నారని సమాచారం.